11 Feb,2017

న‌వ‌ర‌స స‌మ్రాట్ అక్కినేని నాగార్జునని 100వ సినిమా గురించి అడిగితే....ఫ్యాన్స్ లెక్క‌ల ప్ర‌కారం రాజు గారి గ‌ది 2 త‌ర్వాత చేసే సినిమా 100వ సినిమా అంటున్నారు కానీ... నేను గెస్ట్ రోల్స్ చేసిన సినిమాల‌ను కూడా నా సినిమాలుగా లెక్కేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్టు. అందుచేత నా లెక్క నాకుంది.

నా 100వ సినిమా ఏమిటి అనేది నేనే ఎనౌన్స్ చేస్తాను అని నాగార్జున తెలియ‌చేసారు. ఇప్పుడు నాగ్ త‌న లెక్క ఏమిటో చెప్పేసారు. ఎప్పుడంటారా..?  ఓం న‌మో వేంక‌టేశాయ రిలీజ్ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నాగార్జున మాట్లాడుతూ...నేను ఇప్ప‌టి వ‌ర‌కు 95 సినిమాలు చేసేసాను అని చెప్పారు అంటే...96 వ సినిమా ఓం న‌మో వేంక‌టేశాయ‌, 97 రాజు గారి గ‌ది 2, 98 బంగార్రాజు, 99 చందు మొండేటి సినిమా అనుకుంటే...ఆత‌ర్వాత చేసే సినిమానే నాగార్జున 100వ సినిమా అవుతుంది అనుకోవ‌చ్చు.

మ‌రి...నాగార్జున 100వ సినిమాను డైరెక్ట్ చేసే అవ‌కాశం ఎవ‌రు ద‌క్కించుకుంటారో చూడాలి..!

Recent News