17 Jan,2018

'రాజరథం' మొదటి పాటని విడుదల చేసిన విజయ్‌ దేవరకొండ 
ఇదివరకే టైటిల్‌ పాత్రలో రానాని రివీల్‌ చేసి అందరినీ విశేషంగా ఆకట్టుకున్న 'రాజరథం' ట్రైలర్‌ తర్వాత ఈసారి మరింత మంది స్టార్లు 'రాజరథం' కి వెన్నుదన్నుగా నిలవనున్నారు. చిత్రంలోని మొదటి పాట 'కాలేజీ డేస్‌'ని మన 'అర్జున్‌రెడ్డి' విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. విడుదల అవగానే చార్ట్‌ బస్టర్‌గా నిలిచి సంగీత ప్రియులని ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్ని పాటల్ని అనూప్‌ భండారి స్వరపరచగా, రామజోగయ్య సాహిత్యాన్ని అందించారు. అద్భుతమైన లిరిక్స్‌తోపాటు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ట్యూన్స్‌కే నిర్మాతలు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. రామజోగయ్యశాస్త్రిగారు తన పద మాయాజాలంతో పాటకి అచ్చ తెలుగుతనాన్ని తీసుకొచ్చారు. అనూప్‌ భండారి సంగీతం, పాటని చిత్రీకరించిన విధానం ప్రేక్షకులకు తమ ఇంజనీరింగ్‌ 'కాలేజీ డేస్‌'ని మళ్ళీ గుర్తు చేస్తాయి. 
నిరూప్‌ భండారి, అవంతిక షెట్టి మీద బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్లు బోస్కో-సీజర్‌ పర్యవేక్షణలో చిత్రీకరించిన ఈ పాట చాలా ట్రెండీ గా ఉంటుంది. ఈ పాటలో నిరూప్‌, అవంతికలు కాలేజ్‌ స్టూడెంట్స్‌గా చాలా అందంగా కనిపిస్తారు. 'జాలీ హిట్స్‌' టీం నిర్మాణంలో తమ మొదటి సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ 'రాజరథం'ని ఎంతో ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించడం లో ఏ మాత్రం వెనుకాడడం లేదు. కెమరామెన్‌ విలియం డేవిడ్‌ కనులవిందైన కలర్‌ఫుల్‌ విజువల్స్‌తో, నీతా షెట్టి అద్భుతమైన స్టైలింగ్‌తోతో, రాజు పొద్దార్‌ చేసిన ఆర్ట్‌ వర్క్‌తో తెరకెక్కిన ఈ పాటలో కాలేజ్‌ లైఫ్‌ని చాలా సహజంగా ప్రతిబింబిస్తుంది. 
 
'కాలేజ్‌ డేస్‌' పాటలోని లుక్‌, ఫీల్‌ 'జాలీ హిట్స్‌' తమ చిత్రంలోని నిర్మాణ విలువల పట్ల ఎంత కచ్చితంగా ఉంటారనేది ఈ పాట చుస్తే అర్ధమవుతుంది. నిర్మాతలు అజయ్‌ రెడ్డి, అంజు వల్లభనేని, విష్ణు దకప్పగారి, సతీష్‌ శాస్త్రి తమ తొలి నిర్మాణం 'రాజరథం'ని విజువల్‌ పరంగా ఎంతో గ్రాండ్‌గా ఉండేలా నిబద్దతతో పని చేస్తున్నారు. ఇతర సాంకేతిక నిపుణులు కూడా దర్శకనిర్మాతల విజన్‌కి అనుగుణంగా సినిమా కోసం తమ బెస్ట్‌ ఇస్తూ ప్రేక్షకులకు అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో ఉండే చిత్రాన్ని ఇవ్వాలనే సంకల్పంతో 'రాజరథం' ని తెరకెక్కిస్తున్నారు. 
 
'కాలేజ్‌ డేస్‌' పాట చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకులని ఉర్రూతలూగించడం ఖాయం అనే నమ్మకంతో టీం ఎదురు చూస్తోంది. 'రాజరథం' ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 16న విడుదల కానుంది.

Recent News