14 Jan,2018

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా చిత్ర శుక్లా హీరోయిన్‌గా శ్రీరంజని దర్శకత్వంలో 2017లో 'రారండోయ్‌ వేడుక చూద్దాం', 'హలో' వంటి హిట్‌ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'రంగులరాట్నం'. ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి స్పెషల్‌గా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సమావేశంలో నటి సితార మాట్లాడుతూ... ''ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావుగారితో చాలా సినిమాల్లో కలిసి నటించాను. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థలో పని చేయడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. అందరూ ఫ్యామిలీ మెంబర్స్‌లా ట్రీట్‌ చేస్తారు. ఈ చిత్రంలో రాజ్‌తరుణ్‌ మదర్‌ క్యారెక్టర్‌లో నటించారు. ఇంత మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన డైరెక్టర్‌ శ్రీరంజనికి నా ధన్యవాదాలు. అన్ని వర్గాల ఏజ్‌ గ్రూప్‌ వాళ్లకి నచ్చే సినిమా ఇది. చాలా రియలిస్టిక్‌గా వుంటుంది. ఎంతో ఇన్‌స్పైర్‌ అయి నా క్యారెక్టర్‌కి నేనే సొంతంగా డబ్బింగ్‌ చెప్పాను. ఒక ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సంక్రాంతి సినిమా వస్తుంది. ఈ సినిమా అవకాశం ఇచ్చిన సుప్రియగారికి, ప్రసాద్‌గారికి నా థాంక్స్‌'' అన్నారు.

Recent News