29 Dec,2017

జయహో రామానుజ లోగో ఆవిష్కరణ

స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై సాయి వెంకట్ స్వీయ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం జయహో రామానుజ.ఈ చిత్రం యొక్క లోగో ఆవిష్కరణ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. గతంలో నీతోనే నేనున్నా, యువకులు, విజయానికి సిద్ధం, గల్లి కుర్రాళ్ళు, పిశాచి 2 , షాలిని, లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లయన్ సాయి వెంకట్ మొదటి సారిగా మెగా ఫోన్ పట్టబోతున్నారు.  

 

జయహో రామానుజం చిత్రం గురించి సాయి వెంకట్ మాట్లాడుతూ తన స్వప్నంలో కనిపించిన భగవంతుని ఆజ్ఞ ను అనుసరించి 11 వ శతాబ్దం లో జన్మించిన రామానుజం జీవితం ఆధారంగా " భగవత్ రామానుజుల చరిత్ర, కలియుగ దైవ,కలియుగ దైవమైన  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన నిర్మాణము , ఆ భగవంతుని లీలా మహిమలు వీటన్నిటి కలయికతో జయహో రామానుజ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో భక్తి తో పాటు, సామాజిక అంశాలను మేళవించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. 

 

ఈ చిత్రానికి సంబదించిన అన్నీ పాటలను రికార్డు చేయటం జరిగిందని పాటలు అన్నీ బాగున్నాయి అని చెప్పారు. పాటల తోనే సగం సినిమా విజయం సాదించిన ధైర్యం కలిగిందని రామానుజాచార్యుల ట్రస్ట్ కు సంబంధించిన సభ్యులు పాటలు వినటం జరిగింది. కథా పరమైన వివరాలు కూడా వారి అనుమతి తీసుకోవటం జరిగింది. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్రాంతి తరువాత చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతున్నట్లు సాయి వెంకట్ తెలిపారు.

 

ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు జె.ఎల్. శ్రీనివాస్ హాలీవుడ్ లో బతుకమ్మ పాటను పాడి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు లో  స్థానం సంపాదించి నందుకు ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సి.ఎం. వ్యక్తిగత సలహాదారు దేశపతి శ్రీనివాస్ , కేంద్రం లో తెలంగాణా ప్రభుత్వ ప్రతినిది వేణుగోపాలాచారి తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్  అద్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ , నటి కవిత పాల్గొన్నారు.

Recent News