27 Dec,2017

పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న చిత్రం అజ్ఞాతవాసి . అయితే మీడియా వర్గాలకు అందిన సమాచారం  ప్రకారం సినిమా కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ పూర్తి అయ్యాయని ఈ నెల డిసెంబర్ 29 న సెన్సార్ కు పంపుతున్నట్లు తెలుస్తుంది. 

అదే విధంగా ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ పాడిన పాట. సినిమా లోని పాటలన్నీ హిట్ కావటంతో పాటు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ పాడిన కాటమరాయుడా పాట హిట్ కావటం సినిమా కూడా మంచి హిట్ కావటంతో ఈ పాటపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అందరి అంచనా లకు తగ్గట్టుగా మరియు పవన్ కళ్యాణ్ ఎనెర్జీ కి సరిపోయే విధంగా  అనిరుద్ ఈ పాటను కంపోజ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ప్రేక్షకుల కోరిక మేరకు ఆ పాటను నూతన సంవత్సరం  కానుకగా  డిసెంబర్ 31 న విడుదల చేస్తున్నారనిపిస్తుంది.  అదేవిధంగా థియేటర్ ట్రైలర్ ను జనవరి 5 న విడుదల చేస్తున్నట్టుగా సమాచారం . 

Recent News