28 Feb,2017

మూడు ద‌శాబ్దాల‌కు పైగా త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న సీనియ‌ర్ క‌థానాయిక ర‌మ్య‌కృష్ణ‌. సౌత్ లో ఎన్నో స‌క్సెస్ ఫుల్ మూవీస్ లో న‌టించిన ర‌మ్య‌కృష్ణ ఆమ‌ధ్య సినిమాలు కాస్త త‌గ్గించి బుల్లితెర పై ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆత‌ర్వాత  బాహుబ‌లి సినిమాలో శివ‌గామి పాత్ర‌లో అద్భుతంగా న‌టించి మ‌రోసారి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి మ‌ళ్లీ బిజీ అయ్యింది. ప్ర‌స్తుతం ర‌మ్య‌కృష్ణ‌ బాహుబ‌లి 2, శ‌భాష్ నాయుడు సినిమాలో న‌టిస్తుంది. ఈ రెండు సినిమాల‌తో పాటు సూర్య హీరోగా విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న తానాసేంద కూట్టం సినిమాలో కూడా ర‌మ్య‌కృష్ణ నటిస్తుంది. ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తుంద‌ని స‌మాచారం. ప‌వ‌ర్ ఫుల్ రోల్ అంటే ర‌మ్య‌కృష్ణ ఎలా న‌టిస్తుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే...ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌ల్లో న‌టించే సింగం సూర్య సినిమాలో ర‌మ్య‌కృష్ణ పోలీస్ గా న‌టిస్తుండ‌డం విశేషం.

Recent News