31 Oct,2017

మెగాస్టార్ చిరంజీవికి సురేష్‌కొండేటికి ఉన్న అనుబంధం

సురేష్ కొండేటి హైద‌రాబాద్‌కు చ‌ల‌న‌చిత్ర రంగానికి వ‌చ్చిన‌ప్ప‌టినుండి మెగాస్టార్ చిరంజీవి ప్రోత్స‌హిస్తూ వస్తున్నారు. కార‌ణం ఏదైనా కావ‌చ్చు. సురేష్ ప‌ట్ల చిరంజీవికి ఏదో అభిమానం. ఇక సురేష్ కొండేటికి చిరంజీవి గారంటే వీరాభిమానం. అది హ‌ద్దుల్లేని అభిమానం!

     త‌న ఇంట్లో ఏ శుభ కార్య‌క్ర‌మం  జ‌రిగినా చిరంజీవి గారు వ‌చ్చి అక్షింత‌లు వేయాల్సిందే! ఆశీస్సులు ప‌ల‌కాల్సిందే! ఇది సురేష్ కొండేటికి విప‌రీత‌మైన సెంటిమెంట్‌.

     సురేష్ 2001లో జెన్ కారును కొనుక్కుని చిరంజీవిగారి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లారు. దానిని చిరంజీవిగారు స్టార్ట్ చేసి కీస్ సురేష్‌కు ఇచ్చారు. త‌ర్వాత 2006లో సురేష్ స్కార్పియోను కొని చిరంజీవి ద‌గ్గ‌ర‌కెళ్లి ఆయ‌న ఆశీస్సులు పొందారు. ఇక తాజాగా అక్టోబ‌ర్ నెలాఖ‌రున సురేష్ ఫార్చున‌ర్ కారును కొనుకున్నారు. దీనిని కూడా త‌న సెంటిమెంట్ ప్ర‌కారం చిరంజీవి గారింటికి తీసుకెళ్లారు. ఎప్ప‌టిలానే మెగాస్టార్ చిరంజీవి కొత్త కారును స్టార్ట్ చేసి తాళాల‌ను సురేష్ చేతికి అందించి ఆశీస్సులు ప‌లికారు.

     మెగాస్టార్‌, సురేష్‌కు మ‌ధ్య ఇలాంటి సెంటిమెంట్ సంఘ‌ట‌న‌లు ఎన్నో!

Recent News