11 Sep,2017

షూటింగ్ పూర్తి చేసుకున్న లావోస్ మోష‌న్ పిక్చ‌ర్స్ !

 లావోస్ మోషన్ పిక్చర్స్  ప‌తాకంపై  రూపొందుతున్న  మొదటి సినిమా షూటింగ్  విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎస్తేర్ నొరోన్హా,నోయెల్ సీన్ , శ్రీ మంగం , అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రలలో  న‌టిస్తున్నారు.   ప్రముఖ దర్శకుడు రాజమౌళి  వ‌ద్ద  ఈగ, మర్యాద రామన్న , మగధీర  చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసిన క్రాంతి కుమార్ వడ్లమూడి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్  ఇటీవ‌ల పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు క్రాంతి కుమార్ వ‌డ్ల‌మూడి మాట్లాడుతూ... “ బౌండ్ స్క్రిప్ట్ తో షూటింగ్ మొదలుపెట్టి స్క్రిప్ట్ లో వున్నా ప్రతి చిన్న ఎలిమెంట్ ను తెరకెక్కిచాడానికి సహకరించిన నటీ నటులకి , సాంకేతికవర్గానికి, నిర్మాతలకి నా కృతజ్ఞతలు.  సస్పెన్స్ థ్రిల్లర్ నేపధ్యం తో సాగే ఈ చిత్రం లో ప్రతి సన్నివేశం ప్రేక్షకులని థ్రిల్ కి గురి చేస్తుంది. కథ ,కథనం,ఛాయాగ్రహణం లో చూపించిన  వైవిధ్యం మారుతున్న ప్రేక్షకుల ఆంచనాలని అందుకుంటుందని ``అన్నారు. 

నిర్మాతల్లో ఒకరైన శ్రీ రామ్ కందుకూరి మాట్లాడుతూ....``గురువారం రామానాయుడు స్టూడియో లో జరిగిన ప్యాచ్ వర్క్ తో సినిమా నిర్మాణం పూర్తైంది. మాకు కొత్తయిన, దర్శకుడు క్రాంతి,  నటీ నటుల , సాంకేతికవర్గం సహకారంతో   సినిమా సాఫీగా పూర్తవడం జరిగింది. ఎడిటింగ్ డ‌బ్బింగ్ పూర్తైంది. ప్రస్తుతం రీ- రికార్డింగ్ , కలర్ గ్రేడింగ్ , విజువల్  ఎఫెక్ట్స్ పనులు శ‌ర‌వేగంగా  జరుగుతున్నాయి. నవంబర్ లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. త్వరలో టైటిల్ అనౌన్స్ మెంట్ చేయ‌నున్నాం`` అన్నారు. 

ఈ చిత్రానికి కెమెరా చేతన్ మధురాంతకం , సంగీతంః గీత పూనిక , ఆర్ట్ఃర‌మేష్ , ప్రొడక్షన్ కంట్రోలర్ః చౌదరి , ప్రొడక్షన్ మేనేజర్ః మోహ‌న్  రావు , పిఆర్ఓః కుమార‌ స్వామి , కాస్ట్యూమ్ డిజైనర్ః అజ‌బ్ , రచన సహకారంః టైం నాని , రవి కిరణ్ , కథః లావోస్  మోషన్ పిక్చర్స్ , నిర్మాతలుఃరామ్ కేతు, కృష్ణ మోహన్ , శ్రీ రామ్ కందుకూరి , నరేన్ లేబాకు,  స్క్రీన్ ప్లే - దర్శకత్వంః క్రాంతి కుమార్ వడ్లమూడి.

Recent News