08 Sep,2017

రామ్ చరణ్ ముఖ్య అతిధిగా శ్రీవల్లి ప్రీ రిలీజ్ వేడుక! 
ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం శ్రీవల్లి. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 15న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను సెప్టెంబర్ 10 న గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సెంటర్లో భారీగా జరుపనున్నారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధి గా రాబోతున్నారు. 
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఓ వైవిధ్యమైన కథతో విజయేంద్రప్రసాద్ గారు ఎంతో అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. చిత్రీకరణ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమాకి అన్నీ కలిసివస్తున్నాయి. దర్శకధీర రాజమౌళి గారు మా చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అలాగే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ప్రీ రిలీజ్ వేడుక కి వచ్చి మా టీం కి విశేష్ తెలుపుతుండటం వంటివి నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రీ రిలీజ్ వేడుకను సెప్టెంబర్ 10 న గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సెంటర్లో భారీగా జరుపనున్నాము. శ్రీవల్లి ఈ నెల 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు. రాజీవ్‌కనకాల, సత్యకృష్ణ, హేమ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్ శ్రీలేఖ, కెమెరా: రాజశేఖర్.

Recent News