07 Sep,2017

12 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న జయ బి. 'వైశాఖం' 
చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను రూపొందించిన డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో హరీష్‌, అవంతిక జంటగా ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మించిన మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ 12 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. 
ఈ సందర్భంగా డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ - ''యూనివర్సల్‌ పాయింట్‌తో తీసిన 'వైశాఖం' ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి సినిమాలోని సెంటిమెంట్‌ బాగా నచ్చింది. అందుకే విజయం సాధించింది. పాటలు, ఫోటోగ్రఫీ కూడా ఈ సినిమా విజయం సాధించడానికి దోహదపడ్డాయి. ఒక మంచి పాయింట్‌తో మంచి సినిమా తీశారని రిలీజ్‌ అయిన రోజు నుంచి అందరూ అభినందిస్తున్నారు. నాకు మంచి అప్రిషియేషన్‌ వచ్చిన సినిమా ఇది'' అన్నారు. 
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''వైశాఖం' చిత్రం అర్థ శతదినోత్సవం జరుపుకోవడానికి కారకులైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్పెషల్‌ థాంక్స్‌. మానవతా విలువల్ని మరోసారి గుర్తు చేశారంటూ సినిమా చూసిన వాళ్ళంతా మెచ్చుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. 'వైశాఖం' చిత్రం నిర్మాతగా నాకు చాలా మంచి పేరు తెచ్చింది'' అన్నారు. 
హీరో హరీష్‌ మాట్లాడుతూ - ''ఇంత మంచి సినిమాలో నేను హీరోగా నటించడం నా అదృష్టం. 'వైశాఖం' చిత్రానికి ఇంత పేరు వచ్చిందంటే ఆ క్రెడిట్‌ అంతా జయగారికే దక్కుతుంది'' అన్నారు. 
హీరోయిన్‌ అవంతిక మాట్లాడుతూ - '''వైశాఖం'లో నేను చేసిన భానుమతి క్యారెక్టర్‌ అందరికీ గుర్తుండిపోతుంది. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం వచ్చిన డైరెక్టర్‌ జయగారికి, నిర్మాత బి.ఎ.రాజుగారికి థాంక్స్‌'' అన్నారు. 
సంగీత దర్శకుడు డి.జె.వసంత్‌ మాట్లాడుతూ - ''నేను చాలా సినిమాలకు మ్యూజిక్‌ చేసినా 'వైశాఖం' చిత్రం ద్వారా నాకు వచ్చిన గుర్తింపుని ఎప్పటికీ మర్చిపోలేను. టాప్‌ టెన్‌లో నంబర్‌ వన్‌ పొజిషన్‌లో నా పాటలు వుండాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది'' అన్నారు. 
సినిమాటోగ్రాఫర్‌ వాలిశెట్టి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ - '''వైశాఖం' చిత్రానికి నేను ఫోటోగ్రఫీకి ఆడియన్స్‌ నుంచి, ఇండస్ట్రీ నుంచి మంచి అప్రిషియేషన్‌ రావడం చాలా హ్యాపీగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన జయగారికి, రాజుగారికి థాంక్స్‌'' అన్నారు. 
హరీష్‌, అవంతిక జంటగా నటించిన ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్ర పోషించారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ తదితరులు ఇతర ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్‌, డాన్స్‌: వి.జె.శేఖర్‌, ఆర్ట్‌: మురళి కొండేటి, స్టిల్స్‌: శ్రీను, కో-డైరెక్టర్‌: అమరనేని నరేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, దర్శకత్వం: జయ బి.​

Recent News