06 Sep,2017

ప.గో. జిల్లా  జాంగా రెడ్డి  గూడెం సూపర్ స్టార్ట్ కృష్ణ మహేష్ సేన అభిమానులు బవిరిశెట్టి మురళి కృష్ణ ఆద్వర్యం లో ఆగష్టు 31 సూపర్ స్టార్ కృష్ణ మనవడు , సూపర్ స్టార్ట్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ జన్మదినోత్సవ  సందర్బంగా నిర్వహించిన మెడికల్ క్యాంపు ని మాజీ మంత్రి చింతలపూడి MLA శ్రీమతి పీతల సుజాత ప్రారంభించారు . ఈ సందర్బంగా కేక్ కట్ చేసి సీనియర్ అభిమాని మైక్ వెంకటేశ్వర్ రావు ను సన్మానించారు . పీతల సుజాత మాట్లాడుతూ అభిమానులు నిర్వహిస్తున్న ఇలాంటి  కార్యక్రమాలు  అభినందనీయం అని ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రోగులు వినియోగించుకుని ఆరోగ్యవంతులు కావాలని కోరారు . ఈ కార్యక్రమం లో ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వారు అందిస్తున్న వైద్య సేవలను అభినందించారు. అభిమాన అధ్యక్షులు, జ్యూస్ సెంటర్ అధినేత మురళి కృష్ణ దంపతులు 30 వివాహ వార్షికోత్సవ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేసారు . ఈ కార్యక్రమం లో నగర పంచాయితీ వైస్ చైర్మన్ అట్టూరి రామ్ మోహన్ రావు , PCC . రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జెట్టి గురునాథ్ రావు , పట్టణ తే.దే.పా అధ్యక్షులు షైక్ ముస్తఫా , YSRCP మండవల్లి విజయ సారధి , BC సంక్షేమ సాంగ జిల్లా నాయకులూ రాజా సత్యనారాయణ, కొండూరు అంజేశ్వర్ రావు , వందనపు నాగేశ్వర్ రావు , ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు . అభిమానులు PPS . చందర్ రావు , సురేష్, వెంకన్న , సత్తుపల్లి వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు 

Recent News