11 Feb,2017

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - సుకుమార్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది.

ఇటీవ‌ల ఈ చిత్రాన్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే... ఈ సినిమా ఓపెనింగ్ రోజునే చ‌ర‌ణ్‌ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమా గ్రామీణ నేప‌ధ్యంతో ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పేసారు సుకుమార్.  చ‌ర‌ణ్ ప‌ల్లెటూరి యువ‌కుడుగా క‌నిపించిన ఫ‌స్ట్ లుక్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.

ఈ ప‌ల్లెటూరు క‌థ‌కు త‌గ్గ‌ట్టే టైటిల్ కూడా ఉండాల‌ని రేప‌ల్లె అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. రేప‌ల్లె టైటిల్ తో పాటు ప‌ల్లెటూరి మొన‌గాడు అనే మ‌రో టైటిల్ కూడా ప‌రిశీలిస్తున్నార‌ని తెలిసింది.

విభిన్న క‌థాంశంతో రూపొందే ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్ర‌సాద్, సినిమాటోగ్ర‌ఫీని ర‌త్న‌వేలు అందిస్తున్నారు. ఈ ప్ర‌యోగాత్మ‌క చిత్రం చ‌ర‌ణ్ కి ఎలాంటి విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి..!

Recent News