30 Aug,2017

గుంటూరులో అందాల తార రాశి ఖన్నాను సన్మానించిన ఇ.వి.వి.యువ కళావాహిని.

సినీ కధానాయిక రాశిఖన్నాకు అపూర్వ సత్కారం జరిగింది. గుంటూరు నగరంలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అందాల తారను ఇ.వి.వి.యువ కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణముర్తి ఆధ్వర్యంలో సంస్థ సభ్యులు ఆమెను ఘనంగా సత్కరించారు. బంగారు అంగుళీయకం, శాలువాను, జ్ఞాపికను  అందించారు. ఆమె సినీ విజయాలను కొనియాడారు. కార్యక్రమం లో పారిశ్రామిక వేత్త కనకారావు, అక్కినేని ఫాన్స్ అధ్యక్షుడు పి.సూరి, ఆకుల నాగేశ్వరావు, పత్తి భాస్కర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Recent News