బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు కళ: ఏ.ఎస్. ప్రకాష్
సంగీతం: అనిరుధ్ ఛాయాగ్రహణం: వి. మణికండన్
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ రచన, దర్శకత్వం: త్రివిక్రమ్
తారాగణం: పవన్‌కళ్యాణ్, కుష్బూ, ఆది పినిశెట్టి, కీర్తి సురేష్, అను ఎమాన్యుయేల్, బొమన్ ఇరానీ, తనికెళ్ల భరణి, మురళి శర్మ, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, యావత్ తెలుగు సినీ లోకం ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘అజ్ఞాతవాసి’.పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం యొక్క వివరాలు చూద్దాం.
కథ:- వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అత్తారింటికి దారేది'. ఇండస్ట్రీ రికార్డులన్నీ తుడిచి పెట్టేసింది. మళ్లీ ఈ కలయికలో సినిమా అంటే ఖచ్చితంగా అంచనాలు తారాస్థాయిలో వుంటాయి. తన తండ్రిని, సోదరుడిని చంపేసి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని కాజేయాలని చూస్తున్నది ఎవరనేది తెలుసుకోవడానికి అజ్ఞాతాన్ని వీడి వచ్చే కొడుకు కథ ‘అజ్ఞాతవాసి’.
ప్లస్ పాయింట్స్:-
* పవన్ కళ్యాణ్ - పవన్ కళ్యాణ్ - పవన్ కళ్యాణ్
* వర్మ - శర్మ ల (రావు రమేష్ - మురళి శర్మ ) కామెడి
* సినిమాటోగ్రఫీ
* ఫైట్లు
మైనస్ పాయింట్స్ :-
* త్రివిక్రమ్ కథ - కథనం
* అనిరుద్ సంగీతం
* హీరోయిన్ పాత్రలు ఎందుకు ఉన్నాయో తెలియదు
* బలమైన విలన్ లేకపోవడం
* సినిమా లో ఎక్కడా ఆసక్తికరమైన సన్నివేశం లేకపోవడం.
పవన్‌కళ్యాణ్‌ని ఎంత బాగా చూపించాలనేది ఎంతో బాగా తెలిసిన త్రివిక్రమ్ ఇందులో క్లూలెస్‌గా కనిపిస్తాడు. పదే పదే పవన్‌తో ఆ ఆడపిల్లలా ఏడుపులు, బుంగమూతి పెట్టుకోవడాలు వగైరా చేయించడం ఎంతమాత్రం అలరించదు. కథానాయికల పాత్రలు అంత బలహీనంగా ఎలా రాసారా అనిపించకపోదు. ఒక సందర్భంలో హీరో కోసం ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకోవడం చూస్తే ఆశ్చర్యంతో కూడిన నిరాశ వస్తుంది.
సమీక్ష:-
ఈ ‘అజ్ఞాతవాసి’ చిత్రం అంచనాలను అందుకోవడవంలో చాలా వరకు విఫలమైంది. త్రివిక్రమ్ కథా కథనాల రచనలో, టేకింగ్‌లో, పాత్ర చిత్రీకరణలో, కనీసం మాటల్లో కూడా తన సహజమైన మార్కును చూపించలేదు. దీంతో సినిమా స్థాయి చాలా వరకు పడిపోయింది. అక్కడక్కడా పవన్ పెర్ఫార్మెన్స్, కొంత కామెడీ, కొంతమేర పర్వాలేదనిపించిన పాటలు, ఫైట్స్, చిన్నపాటి ఇంటర్వెల్ ఎలిమెంట్, తల్లి, కొడుకుల సెంటిమెంట్ మినహా ఈ సినిమాలో ఎంజాయ్ చేయడానికి, ఎగ్జైట్ ఫీలవ్వడానికి ఏమీ దొరకదు. మొత్తం మీద చెప్పాలంటే పవన్, త్రివిక్రమ్ ల హార్డ్ కోర్ అభిమానులకు ఈ చిత్రం పర్వాలేదనిపింవచ్చు కానీ మిగతా వాళ్లను పెద్దగా మెప్పించదు.