బిలాల్ పూర్ పోలీస్టేషన్ రివ్యూ

15 Mar,2019

దర్శకత్వం : నాగసాయి మాకం 
నిర్మాత : మహంకాళి శ్రీనివాస్ 
సినిమాటోగ్రఫి : తోట వి రమణ
సంగీతం : సాబూ వర్గీస్
నటీనటులు : మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా, గోరటి వెంకన్న తదితరులు ..  
విడుదల : 15-03-2019
రేటింగ్ : 3 / 5


ఇప్పటి వరకు మనం ఎన్నో పోలీస్ కథలని చూసాం .. అవన్నీ సీరియస్ యాంగిల్స్ లో కనిపించేవి.. కానీ మొదటి సారి పూర్తీ స్థాయి కామెడీ యాంగిల్ లో తెరకెక్కిన చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్స్. టైటిల్ లోనే పూర్ పోలీస్ అంటి హింట్ ఇచ్చి మరి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. శ్రీనాధ్ మాగంటి, శాన్వి మేఘన జంటగా నటించిన ఈ సినిమా   ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. మంచి అంచనాలతో ఈ సినిమా నేడు  ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ కథేమిటో తెలియాలంటే కథలోకి వెల్దామా .  

కథ : 

బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా ఉంటాడు సూర్య (మాగంటి శ్రీనాథ్). చాలా కేసుల్ని అవలీలగా పరిష్కరించే అతను ఎవరికీ  భయపడడు. ఆ తరువాత ఒకరోజు బ్యాంక్ దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం చేసిన దొంగల్ని పట్టుకుని  రికవరీ కోసం తీసుకెళ్తుంటే తప్పించుకుంటారు. ఆ పోరాటంలో  తీరా చూసేసరికి ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఇంతకు ఎవరు చంపారు. ఆ మర్డర్ ఎలా జరిగింది. ఈ విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. 

నటీనటుల ప్రతిభ : పోలీస్ పాత్రలో హీరోగా నటించిన శ్రీనాధ్ ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ గా చేసిన శాన్వి ఉన్నంతలో బాగానే చేసింది. ఇక కానిస్టేబుల్ పాత్రలో రచయితా ప్రజా గాయకుడూ గోరటి వెంకన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధుల వరకు బాగానే నటించారు. ఇందులో కోడి దూడ గొడవ ఫన్నీ గా ఉంటుంది.  బ్యాంక్ చోరీ చేసిన దొంగల్ని పట్టుకునే క్రమంలో చేసిన యాక్షన్ బాగుంది. కమర్షియల్ గా బాగా డిజైన్ చేశారు. హీరో శ్రీనాథ్ ఈ ఫైట్ లో బాగా కనిపించాడు . శ్రీనాథ్ కు సరైన పాత్రలు పడితే మాత్రం తప్పకుండా నిలదొక్కుకుంటాడు. ఫంక్షన్ లో నాన్ వేజ్ కోసం కొట్టుకునే సీన్ కి నవ్వకుండా ఉండలేరు. డమ్మీ పోలీస్ కామెడీ ఇరగదీశారు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగున్నాయి. ఓ వైపు బ్యాంక్ దొంగతనం మరి వైపు మర్డర్ మిస్టరీ ని ఛేదించే సీన్స్ బాగా డిజైన్ చేశారు. 14 ఏళ్ల అమ్మాయి కనిపించకుండా పోయే సన్నివేశాలు సస్పెన్సు గా సాగుతాయి.

టెక్నీకల్ హైలెట్స్ : 

సాబూ వర్గీస్ అందించిన సంగీతం బాగుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే డ్యూయెట్ సాంగ్ బాగుంది. గోరేటి ఎంకన్న కళ్ళు సాంగ్ కూడా బాగా కంపోజ్ చేశాడు. రీ రికార్డింగ్ సినిమాకు బాగా హెల్పయ్యింది. పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్ మంచి పాటలు రాశారు, సినిమాటోగ్రాఫర్ తోట వి రమణ కెమెరా వర్క్ బాగుంది. నిర్మాత మహంకాళీ శ్రీనివాస్ నిర్మాణాత్మక విలువలు చాలా బాగున్నాయి.  దర్శకుడు నాగసాయి ఆద్యంతం సహజంగా సాగే కథాకథనాలతో సినిమాను ఆకట్టుకునేలా రూపొందించాడు. సందేశాత్మకంగా ఉన్నా వాణిజ్య అంశాలకు ఎక్కడా లోటుండదు. చైన్ స్నాచర్లను పట్టుకోవడం… వల్ల ద్వారా చాలా విషయాలు తెలుసుకోవడం… క్లిమాక్స్ చేజ్ బాగుంది.

ఫైనల్ గా .. : 

క్రైం నేపథ్యంలో సాగె ఈ సినిమా రసవత్తరంగా సాగడం .. ఎక్కడ అనవసర లేకపోవడంతో సాఫీగా సాగింది. మంచి కమర్షియల్ గా సందేశాత్మక చిత్రం గా ఈ సినిమా ఉంటుంది. విభిన్నమైన సినిమాల్ని ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చే చిత్రమిది. 
 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY