పులిజూదం రివ్యూ 

24 Mar,2019

దర్శకత్వం : ఉన్నికృష్ణన్‌
నిర్మాత : రాక్ లైన్ వెంకటేశ్
సంగీతం : సుషిన్ శ్యామ్
స్క్రీన్ ప్లే : ఉన్నికృష్ణన్‌
ఎడిటర్ : సమీర్ మహమ్మద్
నటీనటులు : మోహన్ లాల్, యాక్షన్ హీరో విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీ ఖన్నా త‌దిత‌రులు.
విడుదల తేదీ : మార్చి 21, 2019
రేటింగ్ : 2. 25 / 5

ప్రజలకు జరిగిన అన్యాయాలను పట్టించుకోని అధికారులను .. అన్యాయాలు చేసేవాళ్లను చంపే కాన్సెప్ట్ తో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. ముక్యంగా ఇలాంటి సినిమాలకు కోలీవుడ్ కేర్ అఫ్ అడ్రస్ గా మారిందన్న విషయం తెలిసిందే. తాజాగా హీరో విశాల్ కూడా అలాంటి ప్రయత్నమే చేసాడు. ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పులిజూదం’. రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాక్ లైన్ వెంకటేశ్ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. మరి ఈ పులిజూదం ఏమిటో తెల్సుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..  

కథ :

ముగ్గురు ప్రముఖ వ్యక్తుల హత్యలు జరుగుతాయి. ఆ హత్యలు చేసిన వాళ్ళను పట్టుకునేందుకు  డీజీపి, ఏడీజీపిగా మంచి పేరు తెచ్చుకున్న  మాథ్యూ (మోహన్ లాల్) ను పిలిపిస్తాడు. అయితే వాలంటరీ రిటర్మెంట్ తీసుకోని ఊటీ వెళ్ళడానికి రెడీ అయిన మాథ్యూ. క్రైమ్ జరిగిన ప్లేస్ ను చూసి.. ఆ క్రైమ్ జరిగిన విధానాన్ని కనిపెట్టగలిగి హఠకులను పసికట్టడంలో మంచి ఇంటిలిజెంట్. మాథ్యూ మాత్రమే ఈ కేసును డీల్ చేయగలరని డీజీపీ మాథ్యూని రిక్వెస్ట్ చేయగా.. తన లీవ్ పక్కన పెట్టి ఈ కేసును హ్యాండిల్ చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అసలు ఆ హత్యలు చేస్తోంది ఎవరో తెలుసుకుంటాడు ? ఆ హత్యలు మదనగోపాల్ అనే వ్యక్తి చేస్తున్నాడని తెలుసుకుంటాడు ? అసలు  దువ్వూరి మదనగోపాల్ (విశాల్)కి ఆ హత్యలకు ఉన్న సంబధం ఏమిటి ? చివరికీ మాథ్యూ ఆ హత్యలు చేస్తోన్న వారిని పట్టుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు మిగతా కథ. 

నటీనటుల ప్రతిభ :

ఇప్పటికే ఎన్నో పోలీస్ తరహా పాత్రల్లో జీవించిన ప్రముఖ నటుడు మోహన్ లాల్ ఇందులో అసిస్టెంట్ డీజీపి మాథ్యూ పాత్రలో  ఎప్పటిలాగే తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దాంతో పాటు కొన్ని క్లిష్టమైన సన్నివేశాల్లో కూడా ఆయన తీవ్రమైన భావోద్వేగాలను పండించారు. వైద్యుడిగా నటించిన విశాల్‌ సినిమాలో కనిపించేది తక్కువ సేపే అయినా ఉన్నంతలో బాగానే చేసాడు.  అలాగే విశాల్ కి జోడిగా నటించిన హన్సిక  తన అందంతో ఆకట్టుకున్నే ప్రయత్నం చేసింది. పోలీస్‌ కానిస్టేబుల్‌ గా నటించిన రాశీ ఖన్నా కూడా బాగానే నటించింది.  ఇక ప్రతినాయకుడిగా నటించిన శ్రీకాంత్‌ ఉన్నంతలో బాగానే చేసాడు .. కానీ అయన చేయాల్సిన పాత్ర మాత్రం కాదు.  అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. 

టెక్నీకల్ హైలెట్స్: 

దర్శకుడు ఉన్నికృష్ణన్‌ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నా దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. అయితే  కొన్ని సన్నివేశాల్లో చక్కని ప్రతిభ  కనబర్చారు.  ‘ప్రతి హీరోలో ఒక విలన్ ఉంటాడు, ప్రతి విలన్ లో ఒక హీరో ఉంటాడు’ అనే స్టోరీ థీమ్ బాగుంది.  కానీ సినిమాలో ఏమాత్రం కమెర్షియల్ హంగులు లేవు .. ఎంటర్ టైన్మెంట్ పూర్. నిజానికి ఇలాంటి కథలు.. కథనాలను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి కానీ అది సినిమాటిక్ గా మార్చేసి ముగించేసాడు దర్శకుడు.  ఇక  సంగీత దర్శకుడు సుషిన్ శ్యామ్ అందించిన నేపధ్య సంగీతం జస్ట్ ఓకే.  కొన్ని కీలక సన్నివేశాల్లో మాత్రం  నేపధ్య సంగీతం ఆకట్టుకున్నేలా ఉంది. సమీర్ మహమ్మద్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ నిర్మాణ విలువలు యావరేజ్.  

 
విశ్లేషణ : 

దర్శకుడు మంచి కథను తీసుకున్నప్పటికీ..అదేమీ కొత్త కథ కాదు కానీ దాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. కానీ టిపికల్ నేరేషన్ తో, పూర్తి ఆసక్తికరంగా సాగని క్రైమ్ డ్రామాతో సినిమాను ఆకట్టుకునే విధంగా మలచలేకపోయాడు. ముఖ్యంగా కథ, కథనం ఉండాల్సిన స్థాయిలో లేవు. ఆసక్తిని పెంచే పాయింట్ తో మొదలు పెట్టినా దాని నిరాశగా ముగించేశాడు.  మోహన్ లాల్ గత జీవితానికి సంబంధించి ఎమోషనల్‌ సన్నివేశాలతో ఆకట్టకునే ప్రయత్నం చేసినప్పటికీ.. సినిమా చాలా చోట్ల బోర్ గా సాగుతుంది. కానీ ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే ఆసక్తిని మాత్రం దర్శకుడు క్రియేట్ చేయలేదు. దీనికి తోడు సినిమా తెలుగు నేటివిటీకి దూరంగా సాగడం కూడా ఫలితాన్ని బాగా  దెబ్బ తీసింది.  మొత్తం మీద ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ ను బాగా ఇష్టపడే ప్రేక్షకులను నిరుత్సాహ పరచడం ఖాయం. 
 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY