ఫ్రెష్ లుక్ తో అందరికీ నచ్చేలా హలో

22 Dec,2017

బ్యానర్ :- అన్నపూర్ణ స్టూడియో  -  మనం ఎంటర్ప్రైజెస్                                     ప్రొడ్యూసర్ : అక్కినేని నాగార్జున

డైరెక్టర్:- విక్రం కే కుమార్.                    సంగీతం :- అనూప్ రూబెన్స్                  ఎడిటర్:- ప్రవీణ్ పూడి

నటీ నటులు :- అఖిల్ అక్కినేని , కళ్యాణి ప్రియదర్శన్                                       కెమేరా :-  పి.ఎస్. వినోద్

అక్కినేని నాగార్జున నిర్మాణ సారధ్యంలో  అఖిల్ అక్కినేని హీరోగా, కళ్యాణి ప్రియదర్శన్  హీరొయిన్ గా  ఈరోజు విడుదల అయిన చిత్రం హలో. విడుదల కు ముందుగానే ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేసి  హలో అంటూ పలకరించిన  ఈ  చిత్రం విశేషాలు మీ కోసం.

కథ:-  శ్రీను ఒక అనాథ బాలుడు. అతన్ని జున్ను అనే అమ్మాయి బాగా ఇష్టపడుతుంది. వాళిద్దరూ ప్రతిరోజూ ఒక చోట కలుసుకుంటారు. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అనుకోకుండా జున్ను వాళ్ళు డెల్లి కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతూ జున్ను తన ఫోన్ నెంబర్ (అఖిల్) శ్రీను కి వంద నోటు మీద రాసి ఇస్తుంది. ఆ నోటు పోగుట్టుకున్న అఖిల్ 13 ఏళ్ళుగా ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.  జున్నుని శ్రీనుని వంద నోటు మళ్ళీ ఎలా కలిపింది అమ్మాయి కోసం శ్రీను ఎలాంటి సాహసాలు చేస్తాడు అనేది తెర మీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్ :- 

1.  స్క్రీన్ ప్లే ఈ సినిమా కు చాలా పెద్ద ప్లస్ పాయింట్. కథ లో పెద్దగా బలం లేకపోయినా తనదైన ముద్రతో మొత్తం సినిమా ను ఆహ్లాదకరమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల ను కట్టిపదేసాడు దర్శకుడు.

2:-  అఖిల్ కు తల్లితండ్రులు గా నటించిన జగపతి బాబు, రమ్యకృష్ణ  మధ్య సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి.  

3:-  అఖిల్ నటన సహజంగా, తన క్యారెక్టర్ లో పూర్తిగా ఒదిగిపోయి నటించాడు. మొదటి సినిమాకు ఈ సినిమాకు అతనిలో చాల పరిణతి కనపడుతుంది. హీరొయిన్ గా పరిచయం అయిన కళ్యాణి కూడా తన గ్లామర్ మరియు బబ్లి లుక్స్ తో ఆకట్టుకుంటుంది. హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.

4:-  హీరో హీరొయిన్ ల చిన్న నాటి స్నేహం, హీరో ను రమ్యకృష్ణ, జగపతి దత్తత తీసుకునే సంఘటన, అఖిల్ రమ్యకృష్ణ ను అమ్మా అని పిలవటం, జగపతిబాబు ను నాన్న అని పిలిచే సన్నివేశాలు ఫ్యామిలి  ప్రేక్షకుల ను ఆకట్టుకుంటాయి.

5:-  అనూప్ రూబెన్స్ సంగీతం, పి.ఎస్. వినోద్  కెమెరా  పనితనం ఈ సినిమాను సాంకేతికంగా మరో స్థాయికి తీసుకెళ్ళాయి. 

మైనస్ పాయింట్స్ :

1. హీరో హీరొయిన్ ల మధ్య ప్రేమ బలపడటానికి కావాల్సిన ఎమోషన్ అసహజంగా అనిపిస్తుంది. ఇద్దరు కలవటానికి పెళ్లి చేసుకోవాటానికి కేవలం విధి మాత్రమె కారణం కావచ్చు కాని ప్రేమ కలగటానికి కొన్ని బలమయిన సన్నివేశాలు అవసరం అనిపిస్తుంది.

2. హీరో హీరొయిన్ ల మధ్య చిన్ననాటి సన్నివేశాలు బాగున్నా కూడా  అఖిల్ కళ్యాణి ల మధ్య లవ్ ట్రాక్ తక్కువగా ఉండటం అభిమానులను కొంత నిరాశకు గురి చేస్తుంది.

3. అఖిల్ , కళ్యాణి , జగపతిబాబు, రమ్యకృష్ణ  తప్ప సినిమాలో మిగతా పాత్రలకు ప్రాధాన్యత ఉండకపోవటం , ముఖ్యంగా విలన్ లేక పోవటం  మాస్ ఆడియన్స్ ను నిరాశకు గురిచేస్తుంది. అజిత్ పాత్ర నెగెటివ్ రోల్ లో ఉన్నా సినిమాకు పెద్దగా  పనికి రాదు. 

4. ఉత్ఖంట రేపే యాక్షన్ సన్నివేశాలు ఉన్నా సినిమా లవ్, ఎమోషనల్ , ఫ్యామిలి ఎంటర్టైన్మెంట్ గా ఉండటంతో వాటి ప్రాధాన్యత తగ్గింది.

5. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమక్ష్ సన్నివేశాలు ఇంకా బలంగా ఉంటే బాగుండేది.

సమీక్ష:- విక్రం కుమార్ కథనం, అనూప్ రూబెన్స్ సంగీతం, అద్భుతం అనిపించే యాక్షన్ సన్నివేశాలు అన్నీ బాగా కుదిరిన ఒక అందమైన కుటుంబ కథా చిత్రం గా హలో చిత్రం ప్రేక్షకుల మదిలో ఉండిపోతుంది. అఖిల్ కు ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల కు దగ్గర చేస్తుంది. నాగార్జున ఆశించినట్లు అఖిల్ కు ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ప్రాజెక్టు అవుతుంది.

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY