తెలుగులో ఒక ఫుల్ లెంగ్త్ పొలిటికల్ సినిమా వచ్చి చాలా కామైంది. కాంటెంపరరీ పాలిటిక్స్ నేపధ్యంలో సినిమాు తీసే ఆసక్తి దర్శక నిర్మాతలో లేదు. చూసే ఓపిక జనంలో లేదు.. అందుకే ఇప్పుడు పొలిటికల్ ఫిలిమ్స్ అవుట్ డేటెడ్ అయిపోయాయి. కొన్ని యాక్షన్ సినిమాలో రాజకీయ నాయకు పాత్రను మెయిన్ విన్‌కు హెంచ్మెన్గా వాడుకోవడం తప్ప హీరోను ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌గా ప్రొజెక్ట్ చెయ్యడం దాదాపు ఈ మధ్యకాంలో లేదని చెప్పాలి. ఒక విధంగా ‘లీడర్’ తర్వాత ‘నేనే రాజు నేను మంత్రి’లో సిమిర్ క్యారెక్టర్లో రానాను రిపీట్ చేసాడు తేజ. అయితే అది క్లాస్.. ఇది మాస్.
అలాగే వ్ స్టోరీలో రకరకా ప్రయోగాు చేసి ప్లాప్ మీద ప్లాప్ు ఇస్తూ వచ్చిన తేజ ఫర్ ఎ ఛేంజ్ కోసం అన్నట్లు పొలిటికల్ జోనర్‌ను ఎంచుకోవటం ఇంట్రస్టింగ్ పాయింట్. ‘బాహుబలి’ సీరీస్ తర్వాత రానాకు దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ రావటం వ్ల ‘నేనే రాజు నేను మంత్రి’ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇక చాలా కాంగా ప్రొడక్షన్‌కు దూరంగా ఉన్న అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు రంగంలోకి దిగడం కూడా ఈ అంచనాకు ఊతమిచ్చింది. ఈ అంచనా నేపథ్యంలో ఆగష్టు 11న విడుదలైన ‘నేనే రాజు నేను మంత్రి’ ఎలా ఉందో చూద్దాం..
హీరో జోగేంద్ర (రానా) రైతుకు తక్కువ వడ్డీకి డబ్బులిస్తూ మరోవైపు చిన్న పెస్టిసైడ్స్ వ్యాపారం చేసుకుంటూ భార్య రాధ (కాజల్) ను అపురూరంగా చూసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తుంటాడు. గర్భవతిjైున రాధ గుళ్ళో కార్తీక దీపాన్ని ముందుగా వెలిగించిందన్న కోపంతో ఆ ఊరి సర్పంచ్ భార్య ఆమెను తోసెయ్యడంతో గర్భం పోతుంది. ఇక ఆమెకు ప్లిను పుట్టరని చెప్తారు డాక్టర్లు. కేవం సర్పంచ్ భార్య అవ్వడం వ్లనే అలా చేసింది. నేను సర్పంచ్ అయితే నా భార్యకు కూడా ఆ గౌరవం దక్కుతుంది కదా అని సర్పంచ్‌ని నమ్మించి అతనికే పోటీగా నిబడి సర్పంచ్‌గా గొస్తాడు జోగేంద్ర. అలా తొలిసారి పదవి తాూకు అధికారాన్ని రుచి చూసిన జోగేంద్ర మాజీ సర్పంచ్‌ని చంపేస్తాడు. ఆ కేసుని అడ్డం పెట్టుకొని తనను బెదిరించిన ఎమ్.ఎల్.ఎ.ని చంపేస్తాడు. ఆ ఎమ్.ఎల్.ఎ. చావుతో వచ్చిన బై ఎక్షన్స్లో పోటీ చేసి ఎమ్.ఎల్.ఎ.గా గొస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాతో మంత్రి అవుతాడు.
ఒక నిరుద్యోగి ప్రభుత్వ ఉద్యోగం కోసం చేస్తున్న నిరాహార దీక్షను విరమింపజేయడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి (తనికెళ్ళ భరణి) వచ్చి నిమ్మరసం ఇస్తుంటే అందులో విషం కలిపారని చెప్పి ఆ నేరాన్ని హోం మంత్రి మీదకి నెట్టి అతన్ని జైుపాు చేస్తాడు. తన వ్ల ఒక కుర్రాడు చనిపోకుండా కాపాడిన జోగేంద్రను సి.యం. మెచ్చుకొని అతనికి సమాచార, సాంస్కృతిక మంత్రి పదవిని ఇస్తాడు. ఇక జైుపాలైన హోంమంత్రి జోగేంద్ర మీద కోపంతో రగిలిపోతుంటాడు. ఇకపై హోం మంత్రి ఆపై ముఖ్యమంత్రి పదవుకోసం జోగేంద్ర చేసే ప్రయత్నాు, వాటిని అడ్డుకోవడం కోసం మాజీ హోంమంత్రి చేసే కుట్రతో సాగుతుంది సినిమా.
ఇక ద్వితీయార్ధంలో పెద్ద బ్డిప్తో ఎంటర్ అవుతుంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కమ్ ఫోకస్ ఛానల్ అధినేత్రి రాణి పాత్ర (కేథరిన్) తన అక్రమాను, హత్యను చానల్లో ప్రసారం చేస్తానని ప్రకటించిన రాణిని బవంతంగా అనుభవిస్తాడు జోగేంద్ర. దానితో ఆమె జోగేంద్ర వశం అవ్వటమే కాకుండా అతన్ని సి.ఎం. కర్చీలో కూర్చోబెట్టే దాకా నిద్రపోనని శపథం చేస్తుంది. పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడని జోగేంద్ర రాణిని అనుభవించిన విషయం భార్య రాధ గ్రహిస్తుంది. దీంతో ఈ పొలిటికల్ డ్రామాకు ట్రయాంగిల్ వ్ ఏంగిల్ తోడవుతుంది. ఇలా ఇలా సాగిపోయే కథ అనేక నాటకీయ పరిణామాు, ట్విస్టుతో క్లైమాక్స్‌కు చేరుతుంది.
ఇక క్లైమాక్స్ ప్రహసనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ రోజున భగత్‌సింగ్‌ను ఉరి తీస్తుంటే కూడా భారత ప్రజు అంతగా చలించిఉండరు. కానీ ఇక్కడ జోగేంద్రను ఉరి తీస్తుంటే అరగంటలో క్షలాది జనం జైు ముందు పోగై భారత రాష్ట్రపతికి కోట్లాది మెసేస్ు పంపించి ఉరిశిక్షను వాయిదా వేయిస్తారు. ఇంతకీ జోగేంద్రను ఉరి తీస్తారా? లేదా.. ? ఆ కాస్త సస్పెన్స్‌ను ప్రేక్షకు ఇంట్రస్ట్ కోసం వదిలేద్దాం..
మొత్తంగా ఇదీ ‘నేనే రాజు నేనే మంత్రి’ కధాకమామిష. నిజానికి సమాజంలో ఒక వ్యక్తిగా ఎదగటానికైనా.. రాజకీయాల్లో ఒక శక్తిగా నివటానికైనా, జీవిత కాం చాదు. మహామహా పొలిటికల్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన రాజకీయ వారసులే అడ్రస్ు గ్లంతవుతున్న ఈరోజుల్లో ఏదో మారుమూ పల్లెటూర్లో వడ్డీవ్యాపారం చేస్తూ పురుగు మందు అమ్ముకొనే జోగేంద్ర రీల్‌కు ఒక పదవి చొప్పున ఎగబాకి ఏకంగా ముఖ్యమంత్రినే గల్లా పట్టుకొనే స్థాయికి వెళ్ళడం చాలా అసహజ పరిణామంగా అనిపిస్తుంది.
మొత్తంమీద కాంటెంపరరీ పాలిటిక్స్ మీద తీస్తున్న సినిమాలో ఉండాల్సిన వాస్తవికతకు దూరంగా వెళ్ళడం మినహాయిస్తే మిగిలిన అంశా పరంగా ఈ సినిమా చాలా బాగుంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ వరకు అసహజంగా సాగినా ఈ సినిమాలో భార్యాభర్త అనురాగం విషయంలో మనసుకు తాకే సన్నివేశాు కోక్లొు. నిజానికి ఆడవాళ్ళకు ఈ రాజకీయా గొడవ పట్టకపోయినా జోగేంద్ర ` రాధ అన్యోన్య దాంపత్యం మాత్రం గిలిగింతు పెడుతుంది. ప్రతి మహిళా ‘‘మొగుడు అంటే భార్యను ఇంత బాగా చూసుకోవాలి’’ అని ఫీల్ అయ్యేంత ఫీల్‌గుడ్‌గా ఉన్నాయి ఆ సన్నివేశాు.
ఇక మేకింగ్ పరంగా చూస్తే కథకు అవసరమైన మేరకే కాకుండా కొన్ని సంధర్భాలో అవసరానికి మించి ఖర్చుచేసి తమ మేకింగ్ స్టామినాను నిరూపించుకున్నారు నిర్మాతు దగ్గుపాటి సురేష్, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి.
ఇక రానా పెర్ఫార్మెన్స్కి వస్తే పంచె కట్టులో భల్లాదేవను చూసినట్టే ఉంది. టైటిల్లో ఉన్న తిక్క, పొగరు, ప్రేమ, మంచితనం, మూర్ఖత్వం వంటి అన్ని షేడ్స్‌ను అద్భుతంగా పోషించాడు ‘రానా’. అలాగే మూర్తీభవించిన స్త్రీత్వం, మంచితనం ఉట్టిపడే పాత్రలో కాజల్ ఒదిగిపోయింది. మిగిలిన అన్నిపాత్రల్లో అందరూ బాగున్నారు, బాగా చేసారు.
ఇక తన కెరీర్ బిగినింగ్‌లో చూసిన బ్లాక్ బస్టర్ హిట్స్త్ ప్చోలేం గానీ, ప్లాప్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ‘తేజ’కు ‘నేనే రాజు నేనే మంత్రి’ ఒక మంచి పవర్ఫుల్ కమ్‌బ్యాక్‌గా నిుస్తుంది. నిజానికి రాజకీయాలో పూర్తిస్థాయి హీరోు ఉండరు. ఫుల్‌టైమ్ విన్స్ ఉండరు. సమయ సంధర్బాను బట్టి రాజకీయ నాయకులో రామరావణులిద్దరూ ఉంటారు. అలాంటి టూ షేడ్స్ ఇమేజ్ ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరో రానాను ఎంచుకోవడంతోనే తేజ సగం సక్సెస్ అయ్యాడు.
ఇక ‘నేనే రాజు నేనే మంత్రి’ లో ప్రత్యేక ప్రశంస దక్కాల్సిన వ్యక్తి డైలాగ్ రైటర్ క్ష్మీ భూపాల్. కొన్ని సంధర్బాలో సన్నివేశంలో దమ్ము లేకపోయినా తన డైలాగు ద్వారా సీన్స్‌ను ఎలివేట్ చేస్తూ సమకాలీ రాజకీయా మీద పవర్ఫుల్ సెటైర్లు సంధించాడు క్ష్మీభూపాల్. ఇక పరుచూరి సోదరు రచనా సహకారం తాూకు ఎలివేషన్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఇక మిగిలిన క్రియేటివ్ అండ్ టెక్నికల్ యాస్పెక్ట్‌లో ‘నేనేరాజు నేనే మంత్రి’ అప్ టుది మార్క్ ఉందని చెప్పవచ్చు.
ప్లస్ు : `
1. రానా, కాజల్, మిగిలిన కాస్టింగ్ పెర్ఫార్మెన్స్
2. క్ష్మీ భూపాల్ డైలాగ్స్
3. నిర్మాత మేకింగ్ స్టాండర్డ్స్
4. మ్యూజిక్ Ê టెక్నికల్ కాంట్రిబ్యూషన్
5. తేజ టేకింగ్ స్టాండర్డ్స్
మైనస్
1. అసహజంగా సాగిన పొలిటికల్ ట్రాక్.
ప్రభు రేటింగ్ : 3.25 / 5