దర్శకత్వం : సతీష్ చంద్ర నాదెళ్ళ.
నిర్మాత : లక్ష్మణ్ క్యాదారి
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫర్ : రవి.వి
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
నటీనటులు : శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్, ఉత్తేజ్, ఝాన్సీ, జెమిని సురేష్, రవిరాజ్, పవన్రమేష్, సన్ని, రోషన్ తదితరులు.
విడుదల తేదీ : మార్చి 22, 2019
రేటింగ్ :2. 5 / 5
శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ జంటగా సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో లక్ష్మణ్ సినీ విజన్స్ బ్యానర్ లో లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం వినర సోదర వీరకుమార. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. మరి వీరు చెబుతున్నది ఏమిటో వినాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..
కథ :
ఆ ఊర్లో ఆటో నడిపే యువకుడు రమణ (శ్రీనివాస్ సాయి) ఆ ఊరిలోని ప్రెసిడెంట్ కొడుకుతో గొడవ పడి, మొత్తం కుటుంబంతో సహా వేరే గ్రామానికి వస్తాడు. అక్కడ అనుకోకుండా ఓ ఆత్మతో పరిచయం ఏర్పడుతుంది. ఆ ఊరిలో కూడా ఆటో నడుపుకుంటున్న క్రమంలో సులోచన (ప్రియాంక జైన్) తో చిన్న గొడవ జరుగుతుంది. ఆ తరువాత కొన్ని నాటకీయ పరిమాణాల అనంతరం ఆమెతో ప్రేమలో పడతాడు రమణ. ఆమె వెంటే పడుతూ చివరికీ సులోచన కూడా తనని ప్రేమించేలా చేసుకుంటాడు. ఆ తరువాత కొన్ని అనుకోని సంఘటనలతో రమణ జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. ఇంతకి ఆ సంఘటనలు ఏమిటి ? చివరికి సులోచనను రమణ పెళ్లి చేసుకున్నాడా ? అన్న విషయాలు మిగతా కథ.
నటీనటుల ప్రతిభ :
హీరోగా నటించిన శ్రీనివాస్ సాయి రమణ పాత్రలో బాగానే నటించాడు. డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి అంశంలో మెచూరిటీ ప్రదర్శించాడు. హీరోయిన్ గా ప్రియాంక జైన్ చాలా అందంగా కనిపిస్తూ, అటు గ్లామర్ , ఇటు నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా చేసింది. హీరో తండ్రిగా కనిపించిన ఉత్తేజ్, హీరో తల్లి పాత్రలో ఝాన్సీ ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో మంచి నటన కనబరిచారు. అలాగే తమ టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
టెక్నీకల్ హైలెట్స్ :
శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం యావరేజ్ గా నిలిచింది. పాటలు జస్ట్ ఓకే. కొన్ని సన్నివేశాల్లో నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ పరవాలేదు. లక్ష్మీభూపాల రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు సినిమాను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. దర్శకుడు సతీష్ చంద్ర నాదెళ్ళ ఆత్మకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ప్రేక్షకులు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా ఉండవు. సినిమా విషయంలో దర్శకుడు ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది.
విశ్లేషణ :
దర్శకుడు ఆత్మకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా దాన్ని పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను తెరకెక్కించలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా వర్కౌట్ కాలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. దీనికి తోడు సినిమా కూడా కొన్ని చోట్ల సినిమాటిక్ గా సాగుతుంది.