సర్వం తాలమయం రివ్యూ

10 Mar,2019

నటీనటులు : జి.వి.ప్ర‌కాష్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి, నెడుముడి వేణు,  వినీత్ త‌దిత‌రులు.
దర్శకత్వం : రాజీవ్ మీనన్
నిర్మాత : లతా మీనన్
సంగీతం : ఏఆర్ రెహ్మాన్
ఎడిటర్ : ఆంటోనీ
విడుదల తేదీ : మార్చి 08, 2019
రేటింగ్ : 2 .75 / 5

 

ప్రేమకథా చిత్రాలు .. సంగీత ప్రాధాన్య చిత్రాల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న రాజీవ్  మీనన్ చాలా గ్యాప్ తరువాత తెరకెక్కించిన చిత్రం సర్వం తాలమయం.  ఈ సినిమా సంగీత ప్రాధాన్యమైన కథే అయినా సంగీతం ఏ ఒక్క వర్గానికో , జాతికో చెందినది కాదని .. ఓ వ్యక్తి నిజ జీవిత కథను స్ఫూర్తి గా తీసుకుని తెరకెక్కించిన చిత్రమిది. సంగీత దర్శకుడు  జి.వి.ప్ర‌కాష్‌ హీరోగా, అప‌ర్ణ బాల‌ముర‌ళి హీరోయిన్ గా రూపొందిన  ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు తమిళ భాషల్లో విడుదల అయినా ఈ సినిమా గురించి  తెలియాలంటే కథలోకి వెల్దామా ..  

కథ :

పీటర్ (జి.వి.ప్రకాశ్) మృదంగం తయారు చేసే ఒక వెనుకబడిన దళిత సామజిక వర్గానికి చెందిన కుర్రాడు. తమిళ హీరో విజయ్ కు వీరాభిమాన సంగంలో ఓకడు. ఆ అభిమానం మత్తులో తన జీవితాన్ని వృధా చేస్తూ.. కాలం గడుపుతున్న అతను. తన తండ్రి తాయారు చేస్తున్న తంబూరను కర్నాటిక్ సంగీత విద్వంసుడిగా ప్రసిద్ధి చెందిన రామా శాస్త్రి (నెడుముడి వేణు) కార్యక్రమానికి ఇవ్వడానికి వెళ్లి అక్కడ తంబురాను ఎలా అతను స్వరాలూ పలికించాడో దగ్గరనుండి చూసి .. తనకు సంగీతం పట్ల ఆకర్షణ మొదలవుతుంది .. ఆ తరువాత ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న పీటర్ చివరికి రామ శాస్త్రి దగ్గర  శిష్యుడిగా చేరతాడు. అతడు తక్కువ కులం వాడు కాబట్టి .. ఈ టీమ్ లో చేర్చుకోవద్దంటూ వ్యతిరేకిస్తుంటాడు మణి ( వినీత్ ). అయినా సరే పట్టుబట్టి సంగీతంలో జ్ఞానం సంపాదించుకుంటున్న పీటర్ జీవితంలో కొన్ని తెలియకుండా జరిగే సంఘటనలు పోలిసుల దాకా వెళ్తుంది.  ఎన్ని కష్టాలు వచ్చినా సంగీతం మీద తన ఇష్టాన్ని.. సంగీతంలో తన శిక్షణను మాత్రం ఆపడు. మరి పీటర్ తాను అనుకున్నట్లు కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడా ? తన గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడా ?  సంగీత విద్వాంసుడుగా మారతాడా ? లేదా అన్నది అసలు కథ. 

నటీనటుల ప్రతిభ :

దేశంలో ఇంకా అగ్రవర్ణాల అణచివేత ఉందన్న విషయాన్ని దర్శకుడు చాలా క్లుప్తంగా కొన్ని సన్నివేశాలతో చెప్పే ప్రయత్నం చేసాడు. సంగీతం అన్నది కేవలం ఒక వర్గానికే కాదని .. టాలెంట్ ఉంది నేర్చుకోవాలన్న తపన ఉన్న ప్రతి వ్యక్తి అర్హుడని కథతో వచ్చిన ఈ సినిమాలో  సామాజికంగా దళిత వర్గానికి చెందిన వాళ్ళకు ఎదురై అవమానాలను ఇబ్బందులను సినిమాలో చాలా చక్కగా చూపించారు. డప్పులు, ఇతర సంగీత వాయిద్యాలు తయారు చేసే కుటుంబంలో పుట్టిన కుర్రాడుగా నటించిన జి.వి.ప్రకాశ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే సంగీత విద్వాంసుడుగా మారుతున్న క్రమంలో అతని నటన కూడా పాత్రకు అనుగుణంగా మారుతూ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా నటించిన అప‌ర్ణ బాల‌ముర‌ళి సారా అనే న‌ర్సు పాత్రలో నటించింది. అలాగే  హీరోతో సాగే లవ్ ట్రాక్ లో  హీరోను మోటివేట్ చేసే సన్నివేశాల్లో బాగా చేసింది. తక్కువ జాతివాళ్ళంటే గిట్టని వ్యక్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మాజీ హీరో వినీత్ చక్కగా నటించాడు.  సంగీత విద్వాంసుడుగా   నెడుముడి వేణు నటన  హైలెట్ గా నిలుస్తోంది. అలాగే మిలిగిన నటీనటులు   తమ పాత్రల పరిధిలో బాగానే చేసారు. 

టెక్నీకల్ హైలెట్స్ :

ఈ సినిమాకు కీలకంగా మారింది సంగీతం .. పాటలతో పాటు నేపధ్య సంగీతం విషయంలో ఏ ఆర్ రెహమాన్ మరోసారి తన టాలెంట్ ప్రదర్శించి సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాడు.   రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ అద్భుతం. ఇక దర్శకుడిగా అయన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు .. అచ్చమైన పెయింటింగ్ లా ప్రతి సన్నివేశం ఉండేలా ఫీల్ కలిగిస్తాడాయన. వర్క్ చాలా బాగుంది. ఆయన కథకి అనుగుణంగా సినిమాలోని సన్నివేశాలని కళ్ళకు కట్టినట్లు చక్కగా చిత్రీకరించారు.  రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. అయితే కథనాన్ని బాగా స్లోగా నడిపినా.. సంగీతానికి సంబంధించిన బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు.  అలాగే ఎడిటింగ్ వర్క్ సూపర్. ఇక నిర్మాణ విషయంలో ఎక్కడ తగ్గలేదు ..  నిర్మాణ విలువులు బాగున్నాయి.

విశ్లేషణ :

ఓ కిందివర్గం కుర్రవాడు సంగీతం నేర్చుకోవడానికి పడిన కష్టాల నేపథ్యంలో సినిమాను తెరకెక్కించిన విధానం బాగున్నప్పటికీ.. కథనం  మాత్రం నెమ్మదిగా సాగింది . హీరో సంగీతం నేర్చుకునే క్రమంలో అతను పడిన ఇబ్బందులకు సంబంధించిన సన్నివేశాలను, ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ దర్శకుడు మాత్రం వాటిని అంతగా పట్టించుకోలేదు. సినిమాలో కీలక భాగాన్ని ఎమోషనల్ గా  ప్రేరణ కలిగించే విధంగా నడిపించినప్పటికీ .. కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆ ఎమోషన్ని అదే స్థాయిలోనే కంటిన్యూ చేయలేక పోయాడు. పైగా ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్. దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నా దాని ఆవిష్కరించే విషయంలో దర్శకుడు పూర్తిగా కమర్షియాలిటీని పక్కడ పెట్టడంతో సినిమా చూసే ప్రేక్షకుడు బోర్ ఫీలయ్యే అవకాశం ఉంది. ముక్యంగా సంగీతం అన్నది ఎవరైనా నేర్చుకోవచ్చు అన్న విషయాన్నీ చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడి ఆలోచనను మెచ్చుకోవచ్చు.  అలాగే సినిమాలో కామెడీ , ఎంటర్టైన్మెంట్ లాంటి అంశాల జోలికే దర్శకుడు వెళ్ళలేదు .. ఇలాంటి కొన్ని విషయాలను పక్కన పెడితే .. సర్వం తాలమయం సంగీతం అంటే ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది. 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY