మిఠాయి రివ్యూ 

23 Feb,2019

సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: రవివర్మన్
నిర్మాత: ప్రభాత్ కుమార్
రచన - దర్శకత్వం: ప్రశాంత్ కుమార్
నటీనటులు: రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, శ్వేతా వర్మ, అదితి మైకల్, కమల్ కామరాజు, భూషణ్ కళ్యాణ్,రవి వర్మ తదితరులు. 
విడుదల : 22-02-2019
రేటింగ్ : 2/ 5
   

వైవిధ్యమైన సినిమాలు ఇప్పటికే తెలుగులో ఎన్నో వచ్చాయి వస్తున్నాయి .. ముక్యంగా హైదరాబాద్ అర్బన్  నేపథ్యం, ఆ నేటివిటీతో కొన్ని ఫక్తు హైదెరాబాడీ సినిమాలు వచ్చాయి .. అవికూడా డార్క్ కామెడీ రూపంలో .. ఆ నేపథ్యంలో తాజాగా వచ్చిన చిత్రం మిఠాయి. పూర్తీ స్థాయి కామెడీ సినిమాగా తెరకెక్కిన మిఠాయి ట్రైలర్స్ తో బాగానే ఆకట్టుకుంది .. మరి అసలు కథలో ఈ మిఠాయి తీపి పంచిందా లేక చేదు మిగిలిచిందా తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే .. 

కథ:

వెంకట్ సాయి (రాహుల్ రామకృష్ణ) ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగి. అనుకోని కారణాలతో అతడి ఉద్యోగం పోతుంది. మరో  మూడు రోజుల్లో పెళ్లి అనగా.. అతడి ఇంట్లో దొంగతనం జరిగి విలువైన వస్తువులు పోతాయి. దీంతో తన మిత్రుడు జానీ (ప్రియ దర్శి)తో కలిసి ఆ దొంగలెవరో పట్టుకునే పనిలో పడతాడు సాయి. ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. చివరికి దొంగ దొరికాడా , లేదా మరి తన సమస్యలన్నీ తీరి సాయి పెళ్లి సజావుగా సాగిందా లేదా అన్నది మిగతా కథ ..  

నటీనటుల ప్రతిభ :

హీరోలుగా .. మిఠాయి సినిమాలో రాహుల్.. ప్రియదర్శి బాగా చేశారు. వీళ్లిద్దరు కామెడీ విషయంలో బాగా పడిపోయారు కాబట్టి .. ప్రత్యేకంగా మాటలు గట్రా రాసుకోలేదనుకుంటా .. ఎందుకంటే  రాహుల్.. ప్రియదర్శి సందర్భానుసారం ఏదో ఒకటి మాట్లాడేస్తూ సాగిపోయినట్లుగా అనిపిస్తుంది. వాళ్ల నేటివ్ పంచులు కొన్ని అలరిస్తాయి. ఐతే సినిమా విషయంలో వాళ్లిద్దరికీ అయినా ఏమైనా క్లారిటీ ఉందా అన్నది మాత్రం సందేహమే. సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్స్ కు పెద్దగా చెప్పుకునే పాత్రలే లేవు.  అదే శ్వేతా వర్మ.. అదితి మైకల్ గురించి చెప్పడానికేమీ లేదు. రవివర్మ.. భూషణ్ కళ్యాణ్.. కమల్ కామరాజు లు ఎందుకు ఈ ఇసినిమాలో నటిస్తున్నారో అన్న అనుమానం కలుగుతుంది.  ఈ సినిమా  చూస్తున్నంతసేపూ కలిగే సందేహం ఒకటే.. అసలు ఈ దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు.. అతడి టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు అని. సాధారణంగా డార్క్ కామెడీస్ తో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తుంటారు. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు చూసేవాళ్లకు ఈ జానర్ ఎక్కదు. పోనీ వేరే సెంటర్ల వాళ్లు చూస్తారా అంటే వారికీ ఏమి అర్థం   కాని అయోమయానికి గురయ్యేలా నడుస్తుంది  ’.  

టెక్నీకల్ హైలెట్స్ :

ఇంకా సాంకేతిక వర్గం గురించి చెప్పాలంటే .. వివేక్ సాగర్ పాటలేవీ ఆకట్టుకోవు.  నేపథ్య సంగీతం బాగుంది. ఈ తరహా సినిమాలకు అవసరమైన ఔట్ పుట్ ఇచ్చాడని చెప్పాలి.  రవివర్మన్ ఛాయాగ్రహణం జస్ట్ ఒకే. నిర్మాణ విలువలు సాధారణంగా ఉన్నాయి. ఇక  దర్శకుడు ప్రశాంత్ కుమార్.. తానేదో కొత్త తరహా కథను చేస్తున్నానన్న భావనలో ఉన్నాడు. 

అనాలసిస్ :

అసలేమాత్రం కసరత్తు చేయని రైటింగ్ , . టేకింగ్ వల్ల గందరగోళం ఏర్పడి ‘మిఠాయి’కాస్త చెదేక్కింది.   ఆరంభంలో కొన్ని సీన్లు కొంచెం కొత్తగా అనిపించి ఏదో వైవిధ్యమైన సినిమా చూడబోతున్న భావన కలిగిస్తాయి. కానీ పావు గంట తర్వాత మొదలవుతుంది అసలు కథ .  ఏ సీన్ ఎందుకొస్తుందో అర్థం కాదు.. ఏ పాత్ర ఏమిటో తెలియదు. చిర్రెత్తుకొచ్చే సంభాషణలు ..  అర్థం లేని మలుపులతో ప్రేక్షకుల్ని ఓ ఆట  ఆడేసుకుంటుంది ‘మిఠాయి’.  అందులోనూ ద్వితీయార్ధం మరీ దారుణం. ఒక దశా దిశా లేకుండా సాగే ‘మిఠాయి’.. ప్రేక్షకుల్లో ఓపికకు పరీక్షా పెట్టేసింది.   రాహుల్.. ప్రియదర్శి లాంటి మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుల్ని పెట్టుకుని ఇంత అర్థరహితమైన కథాకథనాలతో సినిమా ఎలా తీయాలనిపించిందో దర్శకుడికే తెలియాలి. 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY