4 లెటర్స్ రివ్యూ

23 Feb,2019

దర్శకత్వం : ఆర్‌.ర‌ఘురాజ్
నిర్మాతలు : దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫర్ : చిట్టిబాబు.కె
స్క్రీన్ ప్లే : ఆర్‌.ర‌ఘురాజ్
నటీనటులు : కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, స‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని , కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు,  వేణు, తదితరులు,
విడుదల తేదీ : ఫిబ్రవరి 22, 2019
 రేటింగ్ : 2 / 5

నూతన నటీనటులు ఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన చిత్రం ‘4 లెట‌ర్స్‌’. ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక.  దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ నిర్మించారు. మరి ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాలో ఆ 4 లెటర్స్ ఏమిటో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..  

కథ :

విజయ్  (ఈశ్వర్) ఓ టాప్ బిజినెస్ మెన్ కొడుకు. కొన్ని వందల కోట్లకు ఒక్కడే వారసుడు, బి.టెక్ చదువుతున్న అతను మంచి  ఇంటిలిజెంట్‌ ఫెలో. అతను అడిగే ప్రశ్నలకు కాలేజీ లెక్చరర్స్ కూడా భయపడుతుంటారు. విజ్జు తండ్రి ఎన్ని కోట్లు అయిన ఖర్చు పెట్టి, లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చెయ్యమని కొడుకుని ఎంకరేజ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన కారణంగా అంజలి (టువ చ‌క్ర‌వ‌ర్తి) అనే అమ్మాయి  అతను చెప్పినట్లు వినాల్సి వస్తోంది. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం విజ్జుకి ఇంప్రెస్ అయిన అంజిలి అతన్ని ప్రేమిస్తుంది.  కొన్ని కారణాల చేత అంజలి అతనికి బ్రేక్ అప్ చెప్పి విడిపోతుంది. ఆ తరువాత విజ్జు లైఫ్ లోకి మరో అమ్మాయి (అంకిత మ‌హారాణా) వస్తోంది. వీరిద్దరూ ప్రేమిచుకుంటారు.  అంతలో అంజిలి మళ్ళీ విజ్జు లైఫ్ లోకి రావటానికి ప్రయత్నిస్తోంది. చివరకి అతను ఏ అమ్మాయిని ప్రేమించాడు ? ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు అనేదే అసలు కథ.  

నటీనటుల ప్రతిభ :

హీరోగా నటించిన ఈశ్వర్ నటుడిగా మొదటి సినిమా అయినప్పటికీ  అనుభవం ఉన్న నటుడిలా ఈజ్ తో సెటిల్డ్ గా నటించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా తన లవర్ తో అలాగే ఫ్రెండ్స్ తో సాగే సన్నివేశాల్లో   హీరోయిన్ తో ప్రేమలో పడే సన్నివేశంలో ఈశ్వర్ నటన బాగుంది.అయితే అతని డైలాగ్ డెలివరీ ఇంకాస్త బెటర్ గా ఉంటె బాగుండేది. ఇక అమాయికమైన అమ్మాయిగా టువ చ‌క్ర‌వ‌ర్తి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముక్యంగా తన గ్లామర్ తో కుర్రకారును కట్టిపడేసింది.  అలాగే మరో హీరోయిన్ అంకిత మ‌హారాణా నటన కంటే కూడా ఈ ఇద్దరు భామలు గ్లామర్ పైనే ఫోకస్ పెట్టారని అనిపిస్తుంది.  అలాగే క్లైమాక్స్సన్నివేశాల్లో బాగా నటించారు.  ఇక మిగతా  నటీనటుల విషయానికి వస్తే కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, స‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, అనంత్‌, వేణు వంటి ప్రతిభావంతమైన నటీనటులు ఉన్న ఈ చిత్రంలో వాళ్ళు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. నిజానికివారి ని సరిగ్గా ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదు దర్శకుడు. 

టెక్నీకల్ హైలెట్స్ : 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే  సినిమాటోగ్రఫర్ గా   చిట్టిబాబు.కె తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు. మ్యూజిక్ డైరెక్టర్  భీమ్స్ సిసిరోలియో పాటలు అంతగా ఆకట్టుకోలేదు. అయితే  నేపధ్య సంగీతంతో సినిమాని  నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఎడిటర్ ఇంకాస్త కత్తెర వేసివుంటే బాగుండేది.   నిర్మాతలు దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ ల నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. 

అనాలసిస్ :

యూత్ ఫుల్ సినిమా అంటూ .. ప్రేమ నేపథ్యంలో సినిమా అయినప్పటికీ ఈ సినిమాలో చాలా సన్నివేశాలు వెగటు పుట్టిస్తాయి. ముక్యంగా  దర్శకుడు ఆర్‌.ర‌ఘురాజ్ ప్రతి సన్నివేశంలో అవసరం ఉన్నా లేకపోయినా బూతులు కుళ్ళు జోకులు ఇరికించి చికాకు పుట్టించారు.
పైగా ప్రతి సీన్ కథలో మిళితమయ్యే ఉంటుందిగాని, ఏ సీన్ కూడా కథను మాత్రం పరుగులు పెట్టించదు. కథనం కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. ఇక అక్కడక్కడ నవ్వించారు గాని, అది వర్కవుట్ కాలేదు.  ముఖ్యంగా దర్శకుడు కథలోని మెయిన్ సోల్ ని  వదిలేసి, అనవసరమైన కామెడీ ట్రాక్ లతో సినిమాని నింపడం వల్ల  ఫలితాన్ని దెబ్బ తీసింది. దీనికి తోడు బలం లేని కథ, బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద కలిగే ఆ కాస్త ఇంట్రస్ట్ ని కూడా దర్శకుడు నీరుగార్చాడు. సినిమాను దృశ్యంతో చెప్పాలి గాని డైలాగ్ లతోనే చెప్పడానికి శతవిధాలుగా ప్రయత్నం చేశాడు. పైగా ప్రతి సన్నివేశం సినిమాటెక్ గానే సాగుతుంటుంది.  అవసరం ఉన్నా లేకపోయినా బూతు డైలాగ్స్ .. విసిగించే జోకులు వెగటు పుట్టిస్తాయి.  

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY