సంగీతం: హారిస్ జైరాజ్
ఛాయాగ్రహణం: వేల్ రాజ్
నిర్మాత: లక్ష్మణ్ కుమార్
రచన-దర్శకత్వం: రజత్ రవిశంకర్
నటీనటులు: కార్తి , రకుల్ ప్రీత్, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, విఘ్నేష్ కాంత్, అమృత, తదితరులు
విడుదల : 14-02-2019
రేటింగ్ : 2 / 5
తమిళ హీరో అయిన కార్తీ .. తెలుగులో కూడా ఫోకస్ పెట్టి తెలుగు హీరోలతో సమానంగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయన ప్రతి తమిళ సినిమా ఇటు తెలుగులో కూడా విడుదల అవుతూ కార్తీ కి మంచి క్రేజ్ తెస్తుంటాయి. ఈ నేపథ్యంలో తమిళంలో తెరకెక్కిన దేవ్ చిత్రాన్ని అదే పేరుతొ తెలుగులో విడుదల చేసారు. ఖాకి తరువాత రకుల్ ప్రీత్ సింగ్ కార్తీ కి జోడిగా నటించింది. మరి ఈ దేవ్ ఎం చేసాడో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..
కథ:
ఉన్నత కుటుంబానికి చెందిన కుర్రాడు దేవ్ (కార్తి) . అందరిలా రొటీన్ ఉద్యోగాలు చేయడం అతడికి ఇష్టం ఉండదు. ఏదైనా భిన్నంగా సాహసోపేతంగా చేయాలని, ముక్యంగా మనసుకు నచ్చినట్లు జీవించడంలోనే ఆనందం ఉందని భావిస్తాడు. అలాంటి దేవ్ ఒక పెద్ద కంపెనీకి సీఈవోగా ఉంటూ ఓ సందర్బంగా హీరోయిన్ మేఘనను ( రకుల్ ప్రీత్ ) చూసి ఇష్టపడతాడు. ఆమెను తన ప్రేమలో పడేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ముందు దేవ్ ను దూరం పెట్టిన మేఘన.. ఆ తర్వాత అతడి ప్రేమలో పడిపోతుంది. మరి ఈ ప్రేమ ప్రయాణం సజావుగా సాగిందా పెళ్లి తరువాత కూడా దేవ్ తనకు నచ్చినట్లుగా తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుని తాను అనుకున్నది ఎలా సాధించాడు అన్నది మిగతా కథ.
నటీనటుల ప్రతిభ :
హీరో కార్తి గత సినిమాలతో పోలిస్తే భిన్నంగా కనిపించే లుక్ లో ఆకట్టుకున్నాడు. నటన కూడా ఆకట్టుకుంటుంది. పాత్రకు తగ్గట్టుగా బాగా చేసాడు. కానీ అతడి పాత్రను సరిగా తీర్చికే దశా దిశా లేకుండా సాగింది. హీరోయిన్ రకుల్ చాలా గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకుంది కానీ.. ఆమె పాత్రను కూడా సరిగా తీర్చిదిద్దలేదు. ప్రకాష్ రాజ్.. రమ్యకృష్ణలాంటి నటీనటులను సరిగ్గా వాడుకోలేదు. నిజానికి ఈ పాత్రలని వారు ఎందుకు చేసారో అనిపిస్తుంది. హీరో ఫ్రెండుగా చేసిన విఘ్నేష్ కాంత్ కామెడీ పేరుతో విసిగించాడు. మిగతా నటీనటుల గురించి పెద్దగా చెప్పడానికి ఏమిలేదు.
టెక్నీకల్ హైలెట్స్ :
సాంకేతిక విభాగం గురించి చెప్పాలంటే .. హరీస్ జైరాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ నైస్. సినిమా కు రిచ్ లుక్ ను తీసుకొచ్చాయి, ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక డైరెక్టర్ రజత్ రవి శంకర్ ఒక లవ్ స్టోరీ కి అడ్వెంచర్ అనే కాన్సెప్ట్ ను జోడించి చేసిన ఈ ప్రయత్నం విఫలమైంది. రొటీన్ స్టోరి, అక్కడ ఆకట్టుకొని కథనం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది.
విశేషణ :
కార్తి-రకుల్ ప్రీత్ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఏమాత్రం కొత్తదనం లేని కథ.. ఎక్కడా ఆసక్తి రేకెత్తించని కథనం.. సరైన కాన్ఫ్లిక్ట్ లేని లవ్ స్టోరీ.. బోరింగ్ సన్నివేశాలు. ‘దేవ్’లో హీరో అడ్వెంచర్స్ ఇష్టపడే కుర్రాడు. అందరిలా సాధారణంగా జీవితాన్ని గడిపేయడం ఇష్టం ఉండదు. ఆరంభంలోనే అడ్వెంచర్స్ చూడబోతున్నామని అనుకుంటాం. కానీ ఏ సర్ప్రైజ్ లేకుండా సాధారణంగా సినిమాను నడిపించేయడమే పెద్ద సర్ప్రైజ్ . హీరో ఏ పనీ చేయకుండా ఖాళీగా గడిపిస్తుంటే హీరోయిన్ తట్టుకోలేక అతడి నుంచి విడిపోతుంటుంది. కానీ ఇందులో మాత్రం చిత్రంగా.. అప్పటిదాకా ఖాళీగా ఉన్న హీరో కొంచెం పని చేయడం మొదలుపెడితే అది తట్టుకోలేక ఇలా నువ్వు బిజీ అయితే కష్టం ఎప్పుడూ ఖాళీగానే ఉండి నా గురించే ఆలోచించాలి అని కండిషన్ పెట్టి అందుకు ఒప్పుకోలేదని అతడి నుంచి విడిపోతుంది కథానాయిక. సినిమా ఉన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇదే. ఇది కూడా ముగింపు దశలో వస్తుంది. ఇలాంటి పాయింటుకి ప్రేక్షకులు ఎలా కనెక్టవుతారని అనుకున్నారో ఏమిటో? అర్థ రహితంగా అనిపించే ఈ పాయింట్ మినహాయిస్తే ‘దేవ్’ కథలో అసలు ఏ మలుపులూ లేవు. మనం చూస్తున్నది రొమాంటిక్ సీన్స్ అనే ఫీల్ కలిగించడానికి కెమెరామన్ సంగీత దర్శకుడు విఫలయత్నం చేస్తుంటారు కానీ.. ఏమాత్రం ఆసక్తి రేకెత్తించని సన్నివేశాల కారణంగా ఆ ఫీల్ ఎక్కడా కలగదు. ప్రథమార్ధం అయితే మరీ బోర్ కొట్టించేస్తుంది. ద్వితీయార్ధంలో కథ కొంచెం మలుపు తిరిగినా.. అది కృత్రిమంగా అనిపిస్తుంది. సినిమా ముగించడానికి ఇదో ప్రయత్నం లాగా అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ లాంటి పెద్ద నటీనటుల్ని పెట్టుకుని వాళ్లకు పేలవమైన పాత్రలిచ్చారు. పైగా వారికి ఎవరో డబ్బింగ్ చెప్పడంతో అసలేమాత్రం ఆ పాత్రలతో కనెక్ట్ కాలేం. మొత్తంగా హీరో హీరోయిన్ల ఆకర్షణ.. సాంకేతిక హంగులు.. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ మినహాయిస్తే ‘దేవ్’లో చెప్పుకోవడానికి ఏమీ లేదు.