అక్కడొకడుంటాడు రివ్యూ

01 Feb,2019

సంగీతం : సార్క్స్
నిర్మాతలు : శివ శంకర్ రావు , వెంకటేశ్వర్ రావు
దర్శకత్వం : శ్రీపాద విశ్వక్
నటీనటులు : రామ్ కార్తీక్ , దీపిక , శివ కంఠగమనేని తదితరులు .. 
రేటింగ్ : 3 / 5
రిలీజ్ డేట్ : 1ఫిబ్రవరి 2019


రామ్ కార్తీక్, దీపిక జంటగా శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో శివశంకర్ రావు, వెంకటేశ్వర్ రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ”అక్కడొకడుంటాడు ”. బ్లాక్ మనీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హై టెక్నీకల విలువలతో తెరకెక్కింది. మరి ఈ ఒక్కడు ఎవరు .. ఎం చేసాడన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..  

కథ :

పేరు మోసిన రాజకీయ నాయకుడైన కెకె ( రవిబాబు ) దగ్గర కోట్ల కొద్దీ బ్లాక్ మనీ ఉందన్న విషయం తెలుసుకున్న కార్తీక్ , వంశీ , నిత్యా , ఆది , సత్య లు ఆ డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేస్తారు . ఆ బ్లాక్ మనీ కొట్టేసే క్రమంలో కళ్ళు లేని యోగి (శివ కంఠగమనేని ) ఆ దోపిడీ ని అడ్డుకుంటాడు . అసలు వీళ్లకు ఆ బ్లాక్ మనీ గురించి ఎలా తెలిసింది ? ఆ కళ్ళు లేని యోగి ఎవరు ? ఆ బ్లాక్ మనీ కి అతడు ఎందుకు కాపలాగా ఉన్నాడు ? చివరకు ఆ బ్లాక్ మనీ ఏమయ్యింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

బ్లాక్ మనీ లైన్
శివ కంఠగమనేని
రామ్ కార్తీక్
వంశీ
నిత్యా , ఆది
సత్య
సంగీతం
విజువల్స్

డ్రా బ్యాక్స్ :

కొన్ని సన్నివేశాలు

నటీనటుల ప్రతిభ :

అయిదుగురు నటీనటులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు . హాస్య సన్నివేశాలు మాత్రమే కాకుండా యాక్షన్ సీన్స్ లో కూడా రాణించారు . ఇక శివ యోగి పాత్రలో అద్భుతంగా నటించాడు . ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కానీ మిగతా సన్నివేశాల్లో కూడా శివ మంచి పెర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు . రాజకీయ నాయకుడి పాత్రలో ఎప్పటి లాగే రవిబాబు అదరగొట్టాడు .

సాంకేతిక వర్గం :

ఛాయాగ్రాహకులు రాజశేఖరన్ అందించిన విజువల్స్ బాగున్నాయి , పాటలతో పాటుగా నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు శ్రీపాద విశ్వక్ విషయానికి వస్తే …… బ్లాక్ మనీ అంశాన్ని ఎంచుకొని ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకులను అలరించాడు .

బాటమ్ లైన్ : ఆకట్టుకునే కథ 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY