సకలకళా వల్లభుడు రివ్యూ

01 Feb,2019

సంగీతం : అజయ్
దర్శకత్వం : శివ గణేష్
నటీనటులు : తనిష్క్ రెడ్డి , మేఘాల ముక్త
రేటింగ్ : 3 / 5
రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2019

తనిష్క్ రెడ్డి, మేఘాల ముక్త జంటగా శివ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” సకల కళా వల్లభుడు”. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల అయింది. మరి ఈ సకల కళా వల్లభుడు చేసిన ఘనకార్యాలు ఏమిటో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .  

కథ :

తనిష్క్ ( తనిష్క్ రెడ్డి ) చైత్ర ( మేఘాల ముక్త ) ని చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడతాడు. అయితే తనిష్క్ అంటే చైత్ర కు  ఇష్టం ఉండదు , అయినా ప్రేమిస్తున్నా అంటూ చైత్ర వెంట పడుతూనే ఉంటాడు తనిష్క్. అనుకోకుండా గా ఓ రోజు చైత్ర ని ఎవరో కిడ్నాప్ చేస్తారు ? అసలు చైత్ర ఎవరు ? ఆమెని ఎవరు కిడ్నాప్ చేసారు? ఎందుకు చేసారు ? తన ప్రేయసిని తనిష్క్ కాపాడుకున్నాడా ? లేదా ? అన్నది మిగతా కథ ..  

హైలెట్స్ :

ఎంటర్ టైన్ మెంట్
నిర్మాణం 
చిన్నా
హీరో తనిష్క్ రెడ్డి
హీరోయిన్ మేఘాల ముక్త
యాక్షన్ 
సంగీతం
విజువల్స్

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

తనిష్క్ రెడ్డి యాక్షన్ లోనే కాదు నటన పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసాడు . టీజింగ్ సీన్స్ లో కానీ ఫైట్స్ లో కానీ దుమ్ము రేపాడు . ఇక హీరోయిన్ మేఘాల ముక్త తో కూడా మంచి కెమిస్ట్రీ కుదిరింది తనిష్క్ కి . మేఘాల ముక్త ఉన్నంతలో బాగానే చేసింది . సీనియర్ నటులు చిన్నా కు మంచి పాత్ర లభించింది లభించింది . ఇక మిగిలిన పాత్రల్లో పృథ్వీ , జీవా , జబర్దస్త్ రాము తదితరులు తమతమ పాత్రల్లో రాణించారు .

సాంకేతిక వర్గం :

నిర్మాత ఖర్చుకు వెనుకాడకుండా పెట్టిన ప్రతీ పైసా ని తెరమీద చూపించి మెప్పించాడు ఛాయాగ్రాహకుడు . విజువల్స్ బాగున్నాయి . అజయ్ అందించిన సంగీతం ప్రేక్షకులను అలరించేలా ఉంది . ఇక దర్శకుడు శివ గణేష్ విషయానికి వస్తే   యువతరానికి కావాల్సిన కథ , కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . ముఖ్యంగా యువతకు నచ్చేలా ప్రేమ కథని మరింత రొమాంటిక్ గా తీసి భేష్ అనిపించాడు . ఫస్టాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ ని సెకండాఫ్ లో మంచి టెంపో ని తీసుకొచ్చి మెప్పించాడు . అయితే స్క్రీన్ ప్లే పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది .

బాటమ్ లైన్ : యువతని టార్గెట్ చేసాడు. 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY