కొత్తగా మా ప్రయాణం రివ్యూ 

27 Jan,2019

దర్శకత్వం : రమణ మొగిలి
సంగీతం : కార్తీక్ కుమార్ రొడ్రీగ్
ఎడిటర్ : నందమూరి హరి
నటీనటులు : ప్రియాంత్, యామిని భాస్కర్, భాను, కారుణ్య చౌదరి, జీవ తదితరులు 
విడుదల తేదీ : జనవరి 25, 2019
రేటింగ్ : 2 / 5

ప్రియాంత్‌, యామిని భాస్కర్ జంటగా  ర‌మ‌ణ మొగిలి  దర్శకత్వంలో నిశ్చ‌య్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకం పై తెరకెక్కిన `కొత్త‌గా మా ప్ర‌యాణం’  చిత్రం ఈ శుక్రవారం రోజున విడుదల అయింది. మరి ఈ సినిమాలోని ప్రేమికుల ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.  
 
కథ :

కార్తీక్ (ప్రియాంత్‌) సాఫ్ట్ వేర్ ఉద్యోగి, ఎలాంటి టెన్షన్స్ లేకుండా హాయిగా అమ్మాయిలతో తిరుగుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు.  ముక్కుసూటి మనస్తత్వం..చాలా హార్డుకోర్ అయినా ఇతగాడు  కీర్తి (యామిని భాస్కర్)ను చూసి ప్రేమలో పడతాడు. ప్రేమా పెళ్లి పై అస్సలు నమ్మకం లేని కార్తీక్, కీర్తితో కలిసి సహాజీవనం చేద్దామని వెంట పడుతుంటాడు. కార్తీక్ లగే కీర్తి కి కూడా  పెళ్లి పై సరైనా అభిప్రాయం ఉండకపోవడంతో  సహా జీవనం చెయ్యడానికి అంగికరిస్తోంది. అలా ఇద్దరు కమిట్మెంట్ చేసుకుని సహజీవనం మొదలు పెడతారు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వస్తాయి. వాటికీ తోడు కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఇద్దరు విడిపోతారు. ఆ తరువాత మళ్ళీ కలిసారా ? దానికోసం కార్తీక్ ఏమి చేసాడు ? అన్న విషయాలు మిగతా కథ.  
 

నటీనటుల ప్రతిభ : 

 హీరో  ప్రియాంత్‌ నటన పరంగా ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగానే చేసినప్పటికీ అంతగా అనుభవం లేనట్టే కనిపిస్తుంది. ఇక హీరోయిన్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో బాగానే చేసాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునే కీర్తి పాత్రలో యామిని భాస్కర్ ఆకట్టుకుంది. నటనతో పాటు, రొమాంటిక్ సన్నివేశాల్లో ఆమె చక్కగా చేసింది. ముక్యంగా క్లైమాక్స్ లో ఆమె నటన సినిమాకే హైలెట్.  ఇక మిగిలిన నటీనటులు కూడా ఉన్నంతలో బాగానే చేశారు.  

టెక్నీకల్ హైలెట్స్ : 

సంగీత దర్శకుడు కార్తీక్ అందించిన నేపధ్య సంగీతం పరవాలేదనిపించింది. అయితే  పాటల్లో ఒకటి తప్ప మిగతావన్నీ వృదాగానే ఉన్నాయనిపిస్తోంది. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువ‌లు పరవాలేదు.  దాదాపు ఇలాంటి కథతో ఇప్పటికే సినిమాలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే .. కథ పరంగా నేటి యువత ఆలోచనల నేపథ్యంలో దర్శకుడు మంచి కథ తీసుకున్నప్పటికీ దానికి  పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు.   సహా జీవనానికి సంబంధించి మంచి పాయింట్ ను తీసుకున్నారు కానీ దాన్ని  ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. హీరో, హీరోయిన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు తేలిపోయాయి. కొన్ని కీలక సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. పైగా హీరో హీరోయిన్ల మధ్య అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలు, ముద్దులకు హద్దు లేకుండా పోయింది. ముక్యంగా కొన్ని   రొమాంటిక్ సన్నివేశాలు అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 సినిమాలను మించిపోయేలా ఉన్నాయి. డైలాగ్స్ అయితే మరి టూ మచ్.   హీరో పాత్ర పెద్ద మైనస్.  
 
విశ్లేషణ : 

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏ కోణంలోనూ ఆకట్టుకునే విధంగా సాగదు.  ఒకటి రెండు ఎమోషనల్ సన్నివేశాలు, హీరో హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలు  ఆకట్టుకుంటాయి. చాలా సన్నివేశాలు ఆసక్తికరంగా సాగకపోగా విసిగిస్తాయి. దీనికి తోడు సరిగ్గా సాగిపోనీ కథనం ప్రేక్షకుడిని అసహనానికి గురిచేస్తుంది. మరి హీరోను మాస్ హీరోలా చూపించే ప్రయత్నంలో హీరో ఓవర్ యాక్షన్ చేసాడన్నది క్లియర్ గా తెలిసిపోతుంది. మొత్తానికి ఓ రొటీన్ కథను అంతకంటే రొటీన్ గా తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు తప్పకుండా బోర్ కొట్టిస్తుంది. 

@ బోరింగ్ జర్నీ 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY