సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: జార్జ్.సి.విలియమ్స్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
రచన - దర్శకత్వం: వెంకీ అట్లూరి
నటీనటులు: అఖిల్, నిధి అగర్వాల్, రావు రమేష్, నాగబాబు, ప్రియదర్శి, పవిత్ర లోకేష్, సితార, హైపర్ ఆది తదితరులు
విడుదల : 25-01-2019
రేటింగ్ : 2 .5 / 5
అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ హీరోగా అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా మొదటి సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేదు .. దాంతో రెండో ప్రయత్నంగా హలొ అంటూ వచ్చిన ప్రేక్షకులు పెద్దగా రిసీవ్ చేసుకోలేదు .. దాంతో తనడైన ప్రేమకథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నమే మిస్టర్ మజ్ను. ‘తొలి ప్రేమ’తో సత్తా చాటిన వెంకీ అట్లూరి రూపొందించిన చిత్రమిది. మరి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మిస్టర్ మజ్ను’ ఎలా ఆకట్టుకున్నాడో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..
కథ:
విక్కీ ( అఖిల్) ఒ ప్లేబాయ్. అందమైన అమ్మాయిని చుస్తే చాలు నిమిషాల్లో పడేస్తాడు. ఆ అమ్మాయితో వారం రెండు వరాలు రొమాన్స్ చేసి విడిపోతాడు. ఇలా పదుల సంఖ్యలో అమ్మాయిలతో ప్రేమాయాణం నడిపిన అతడికి అనుకోకుండా ఎదురుపడుతుంది నికిత( నిధి అగర్వాల్ ).. తనకు కాబోయే వాడు రాముడై ఉండాలని ఆశించే నిక్కీ పరిచయం అవుతుంది. ఇలా ఇద్దరు అపోజిట్ అభిప్రాయాలతో ఉన్న వీరిమధ్య ప్రేమ ఎలా పుట్టింది .. ముందు విక్కీ అంటే పడని నిక్కీ తర్వాత అతడి వ్యక్తిత్వం నచ్చి ప్రేమిస్తుంది. విక్కీ కూడా అంగీకరిస్తాడు కానీ.. తర్వాత ఆమె తీరుతో విరక్తి చెందినట్టు తెలుసుకున్న నిక్కీ విక్కీకి దూరం అవుతుంది. ఆమె దూరం అవ్వడంతో తాను నిజంగానే నిక్కిని ప్రేమించానని తెల్సుకుని ఆమెకు దగ్గరకావడానికి ఎం చేసాడన్నది మిగతా కథ.
నటీనటుల ప్రతిభ :
ప్లేబాయ్ గా , సీరియస్ లవర్ పాత్రలో అఖిల్ బాగానే చేసాడు. లుక్స్.. స్టైలింగ్.. బాడీ లాంగ్వేజ్ లాంటి విషయాల్లో శ్రద్ధ పెట్టి ప్లేబాయ్ గా సెట్టయ్యాడు. కానీ ఎమోషనల్ సీన్లలో నటించాల్సి వచ్చినపుడు మాత్రం తడబడ్డాడు. నటన విషయంలో ఇంకా నేర్చుకోవాలి. డ్యాన్సులు.. ఫైట్లలో ఎప్పట్లానే ప్రతిభ చూపించాడు. అఖిల్ చుట్టూ ఒక రకమైన నెగెటివిటీ ముసురుకున్న నేపథ్యంలో అతడి కెరీర్ ను పైకి లేవడానికి ఒక మిరాకిల్ లాంటి సినిమా అవసరం. ‘మిస్టర్ మజ్ను’ సినిమా ఒక దశ వరకు సాగే తీరు చూస్తే మిరాకిల్స్ జరగకపోయినా.. అఖిల్ కు ఇదొక డీసెంట్ మూవీ అవుతుందనే అనిపిస్తుంది. తొలి రెండు సినిమాల్లో మాదిరి నేలవిడిచి సాము చేయకుండా.. అందరికీ తెలిసిన ఒక సింపుల్ రొమాంటిక్ లవ్ స్టోరీలో ఒదిగిపోవడానికి అఖిల్ సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్నట్లే కనిపిస్తుంది. హీరోయిన్ నిధి అగర్వాల్ జస్ట్ ఓకే అనిపిస్తుంది.ఆమె పాత్రకు సెట్టయింది కానీ.. పెద్దగా ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. ప్రియదర్శి అక్కడక్కడా బాగానే నవ్వించాడు. రావు రమేష్ , జయప్రకాష్.. నాగబాబు.. సితార.. పవిత్ర లోకేష్.. రాజా.. వీళ్లంతా పాత్రలకు తగ్గట్లుగా కనిపించారు. హైపర్ ఆది యావరేజ్ గా నవ్వించాడు.
సాంకేతిక వర్గం హైలెట్స్ :
ముందుగా చెప్పుకోవలసింది థమన్ గురించే. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ముక్యంగా రీ రికార్డింగ్ అదరగొట్టాడు. ఐతే టైటిల్ సాంగ్ మినహా పాటలు సినిమాలో ఆశించినంత ప్రభావవంతంగా లేవు. జార్జ్ విలియమ్స్ విజువల్స్ సినిమాకు మరో ఆకర్షణ. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో నిర్మాత ఎక్కడ రాజీ పడలేదు. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి తన తొలి సినిమా ‘తొలి ప్రేమ’ ఫార్ములా లాగానే ఇక్కడ ఫాలో అయ్యాడు. ప్రథమార్ధంలో లవ్-బ్రేకప్.. ద్వితీయార్ధంలో కలవడం అనే అంశాలపై కథ నడిపాడు. స్క్రీన్ ప్లే విషయంలో పైపైన నడిపించాడు. యూత్.. ఫ్యామిలీస్ మెచ్చేలా కొన్ని సన్నివేశాలు తీర్చిదిద్దాడు కానీ.. ఔట్ పుట్ విషయంలో నిరాశ పరిచాడు. ముఖ్యంగా ప్రేమకథలో ‘ఫీల్’ తీసుకురావడంలో నిరాశ పరచాడు . ప్రథమార్ధం వరకు ఏదో అలా ఎంగేజ్ చేయనైతే చేస్తుంది కానీ.. ఇక్కడ ప్రేమకథలో ఫీల్ మిస్సయింది. హీరో ప్లే బాయ్ అయినా కూడా హీరోయిన్ లవ్ లో పడడం కాస్త వింతగా అనిపిస్తుంది. పైగా ఇద్దరూ కలవడానికీ పెద్ద కారణాలు కనిపించవు. అలాగే విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులు కూడా ఎఫెక్ట్ గా ఉండవు .
విశ్లేషణ :
భారీ అంచనాల మధ్యన వచ్చిన ఈ చిత్రం హీరో క్యారెక్టరైజేషన్తో, అలాగే కొన్ని సన్నివేశాలతో బాగా ఆకట్టుకున్నప్పటికీ.. కథ మరియు సెకెండ్ హాఫ్ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో హీరోయిన్ హీరోన్ని రిజెక్ట్ చేసే సన్నివేశాలు, అసలు హీరోను అంతగా ఎందుకు రిజెక్ట్ చేస్తోందో అనే విషయంలో బలమైన కారణాలు లేకపోవడం, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ లో సరైన క్లారిటీ లేకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. అయితే అఖిల్ తన లుక్స్ పెర్ఫార్మెన్స్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసారు. నిధి అగర్వాల్ నటన బాగుంది. మొత్తం మీద అక్కినేని అభిమానులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది. ప్లే బాయ్ లాగా ఉండే కుర్రాడు సీరియస్ ప్రేమికుడిగా మారిపోయి పరిణామం చెందే కథలతో దశాబ్దాలుగా చాలా సినిమాలు వచ్చాయి తెలుగులో. వీటిలో చాలా వరకు విజయవంతం అయినవే. కథ పాతదైనా ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథను నడపిస్తే విజయవంతం కావచ్చు. ఇటు సెంటిమెంటుతో పాటు యాక్షన్ పార్ట్ కూడా బాగానే డీల్ చేశారు. కొత్తదనం.. బలం లేని కథ.. నీరసం తెప్పేంచే ద్వితీయార్ధం నిరాశకు గురి చేస్తాయి.
టాగ్ లైన్ : బోర్ కొట్టేస్తాడు