ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ 

09 Jan,2019

ఎన్టీఆర్ - కథానాయకుడు రివ్యూ 


దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు : బాలకృష్ణ , సాయి కొర్రపాటి , విష్ణు ఇందూరి
సంగీతం : కీరవాణి
సినిమాటోగ్రఫర్ : జ్ఙానశేఖర్
ఎడిటింగ్  : రామకృష్ణ
నటీనటులు : బాలకృష్ణ , విద్యాబాలన్ , ప్రకాష్ రాజ్ , రానా, సుమంత్
విడుదల తేదీ : జనవరి 09, 2019
రేటింగ్ : 3 / 5

ఎన్టీఆర్ ... ఈ మూడక్షరాల గురించి దేశంలో ఎవరిని అడిగిన చెబుతారు.. ముక్యంగా తెలుగు ప్రజలు దేవుడిగా కొలిచే మహా నాయకుడు .. ఎవర్గ్రీన్ సూపర్ స్టార్ అన్న నందమూరి తారక రామారావు. అయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమే. అలాంటి మహానుభావుడి చరిత్రను తెలుగు ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేసాడు అయన తనయుడు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా అనుకున్నప్పటినుండి జనాల్లో ఆసక్తి రేపుతున్న ఎన్టీఆర్ రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ భారీ అంచనాలమధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి  ఎన్టీఆర్ జీవితం గురించి తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .. 

కథ :

రామారావు (బాలకృష్ణ) నిమ్మకూరులోని ఓ రైతు ఇంట్లో పుట్టిన యువకుడు. మంగళగిరి గుంటూరు జిల్లాలో సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేస్తుంటాడు. ఆ ప్రభుత్వ ఆఫీస్ లో లంచగొండి తనాన్ని సహించని రామారావు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. అప్పటికే బసవ తారకం ( విద్యాబాలన్ ) తో పెళ్ళై రెండేళ్ల కొడుకు కూడా ఉంటాడు. ఆ తరువాత సినిమాల్లోకి వెళ్లాలన్న అయన ఆలోచనతో  ఎల్వీ ప్రసాద్ పిలుపును స్వీకరించి మద్రాసు వెళ్ళిపోతాడు. అక్కడ విజయవాహిని స్టూడియోస్ మరియు కె.వి.రెడ్డిల అండదండలతో వెండితెర ఇలవేల్పుగా ఎదుగుతాడు. నటుడిగా శిఖరాగ్ర స్థాయిని అందుకుంటాడు. ఎంత పేరు, ప్రఖ్యాతి సంపాదించినా  ప్రజలను మాత్రం మరువడు రామారావు. అప్పటివరకూ ఎవరూ చేయలేని ప్రయోగాలు, సాహసాలు చేసి అందరి మెప్పు, అభిమానం సంపాదించుకొంటాడు. ఇండియన్ మొదటి సూపర్ స్టార్ గా ఎలా ఎదిగారు ? ఆ తరువాత రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.

నటీనటుల ప్రతిభ :

ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవలసింది బాలకృష్ణ గురించే. అయన నటన మేజర్ హైలైట్.  ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయిన తీరు చూస్తే ఈపాత్రను బాలయ్య తప్ప ఎవరు చేయలేరని అనిపిస్తుంది. 35 ఏళ్ల ఎన్టీఆర్ లా కనిపించడానికి కాస్త ఇబ్బందిపడ్డాడు. ఎన్టీఆర్ ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ ను మక్కీకి మక్కీ దింపేసిన బాలయ్య.. ఉచ్ఛారణ విషయంలో మాత్రం కాస్త తడబడ్డాడు.  ఎన్టీఆర్ పాత్రలో నటించి, ఆయన బయోపిక్ ను నిర్మించి బాలయ్య చరితార్ధుడయ్యాడు. ఇక బాలకృష్ణ నటన పరంగా మెప్పించిన పాత్రలు బసవతారకం, అక్కినేని గా సుమంత్.  ఫస్ట్ హాఫ్ లో వచ్చే కృష్ణుడి ఎపిసోడ్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రింట్ సన్నివేశాలు సినిమా కు హైలైట్ గా నిలిచాయి. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులను చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. హరికృష్ణ రౌద్రాన్ని ఆయన కుమారుడు కళ్యాణ్ రామ్ చక్కగా పలికించాడు.  కె.వి.రెడ్డిగా క్రిష్, విజయవాహిని స్టూడియోస్ అధినేతలు నాగిరెడ్డి-చక్రపాణీలుగా ప్రకాష్ రాజ్-మురళీశర్మ ఒదిగిపోయారు. శ్రీదేవిగా రకుల్, జయప్రదగా హన్సిక ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.  

సాంకేతిక వర్గం :

మహా నటుడు ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కించడం సవాలు తో కూడుకున్న పని. ఈ విషయంలో క్రిష్ చాలా వరకు విజయం సాదించాడనే చెప్పొచ్చు. అయితే స్లో నరేషన్ అలాగే ఎక్కువ నిడివి సినిమాను అనుకున్న రేంజ్ కు తీసుకురాలేకపోయాయి.  కీరవాణి సంగీతం ఈచిత్రానికి ప్రధాన ఆకర్షణ గా నిలిచింది.   బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.   జ్ణానశేఖర్ సినిమాటోగ్రఫీ  అలనాటి ఫ్రెమింగ్స్ ను ఆయన రీక్రియేట్ చేసిన తీరు, ఒక చరిత్ర చూస్తున్నామనే భావన ప్రేక్షకుల్లో కలిగించడం కోసం లైటింగ్ & టింట్ విషయంలో ఆయన తీసుకొన్న జాగ్రత్తలు అభినందనీయం. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహిస్తే బాగుండేది. సాయి మాధవ్ బుర్ర రాసిన సంభాషణలు బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. బయోపిక్ సినిమాలంటే ఆసక్తిరమైన మలుపులు గ్రిప్పింగ్ నరేషన్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో అవి మిస్ అయ్యాయి. సెకండ్ హాఫ్ కూడా నెమ్మదిగా సాగడం కూడా సినిమాకి మైనస్సే అయ్యింది. గ్రిప్పింగ్ నరేషన్ తో మరికొన్ని ఎలివేషన్ సన్నివేశాలతో సినిమాను ఆసక్తికరంగా మార్చి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదే.

 విశ్లేషణ :

మహా నటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు చాలా వరకు మెప్పించింది. బాలకృష్ణ నటన , సినిమాటిక్ ఎలివేషన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవ్వగా , స్లో నరేషన్ ,నిడివి సినిమాకు మైనస్ అయ్యాయి. ఇక ఈచిత్రం నందమూరి అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది.   ఒక బయోపిక్ కు కావాల్సిన రీసెర్చ్ కనిపించలేదు.. కేవలం ఎన్టీఆర్ అనే వ్యక్తి వ్యక్తిత్వాన్ని, అతని మొండి ధైర్యాన్ని, వెన్నుచూపని స్వభావాన్ని, ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే మొక్కవోని ధైర్యాన్ని మాత్రమే తెరపై ప్రెజంట్ చేయగలిగాడు.   వీటన్నిటికీ కారణమైన యాటిట్యూడ్ ను ఆయన ఎలా పుణికిపుచ్చుకున్నాడు అనేది మాత్రం చూపించలేదు.  రామారావు కృష్ణుడిగా బాగోడు అని నాగిరెడ్డి-చక్రపాణిలు గొడవపడడం, వాళ్ళని కె.వి.రెడ్డి కన్విన్స్ చేయడానికి ప్రయత్నించే సందర్భంలో బాలకృష్ణను శ్రీకృష్ణుడిలా ప్రెజంట్ చేసిన తీరు, ఆ సన్నివేశానికి ఇచ్చిన ఎలివేషన్ మాత్రం అద్భుతం. అలాగే.. కథానాయకుడు మహానాయకుడిగా రూపాంతరం చెందే సందర్భాలను పిక్చరైజ్ చేసిన తీరు కూడా బాగుంది. ముఖ్యంగా.. దీవిసీమ కష్టాలు ఎన్టీఆర్ లో ఆలోచనాగ్నిని రగిలించిన విధానాన్ని తెరపై చూపించిన విధానం అభినందనీయం. ఓవరాల్ గా ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ కి మంచి లీడ్ ఇచ్చాడు క్రిష్. సో సెకండ్ పార్ట్ కోసం నందమూరి అభిమానులు మాత్రమే కాదు ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఆశగా ఎదురుచూస్తాడు.  ఇది లోకం ఎరిగిన చరిత్ర. తెలిసిన వాళ్ళకు పరమాన్నం లాంటి సినిమా  

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY