దర్శకత్వం : రాహుల్ సంక్రుత్యన్
నిర్మాత : ఎస్ కె ఎన్
సంగీతం : జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫర్ : సుజిత్ సారంగ్
ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్
నటీనటులు : విజయ్ దేవరకొండ , ప్రియాంక జవాల్కర్ , మాళవిక నాయర్
విడుదల తేదీ : నవంబర్ 17, 2018
రేటింగ్ : 2. 75 / 5
అర్జున్ రెడ్డి మానియాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందన్నది అయన రౌడీ గ్యాంగ్ చేస్తూనే అర్థం అవుతుంది. తాజాగా గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ హిట్ అందుకున్న విజయ్ తాజాగా టాక్సీవాలా గా భయపెట్టడానికి రెడీ అయ్యాడు. కొత్త దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ హీరోయిన్స్. మరి ఈ టాక్సీవాలా ఎలా ఆకట్టుకున్నాడు .. ఎన్ని కష్ఠాలు పడ్డాడో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..
కథ : శివ (విజయ్ దేవరకొండ) ఐదు సంవత్సరాలు కష్టపడి పూర్తి చేసిన డిగ్రీ చేతబట్టుకుని జాబ్ కోసం హైదరాబాద్ వస్తాడు. రకరకాల ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగిపోయిన శివ .. ఓ కారు కొనుక్కొని క్యాబ్ డ్రైవర్ సెటిల్ అవుతాడు. ఇక అతని లైఫ్ అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో కార్ లో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా శివ లైఫ్ లో ఊహించని సంఘటనలు జరుగుతాయి. దాంతో ఆ కార్ ని వదిలించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆ క్రమంలో ఆ కార్ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అంతలో ఆ కారు లో ప్రయాణించిన ఓ డాక్టర్ ను ఆ కారు అతి దారుణంగా చంపేస్తోంది. అసలు ఆ కార్ అతన్ని ఎందుకు చంపుతుంది ? ఆ కార్ లో ఏముంది ? ఫైనల్ గా ఆ కారు ఎవరి పై రివేంజ్ తీసుకోవాలనుకుంటుంది ? లాంటి విషయాలు మిగతా కథ ..
నటీనటుల ప్రతిభ : క్యాబ్ డ్రైవర్ గా విజయ్ దేవరకొండ చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఓ ఆర్డనరీ కుర్రాడిగా కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. కొన్ని హర్రర్ సన్నివేశాల్లో తన నటనతో అక్కడక్కడా నవ్విస్తూనే.. ఇటు ఆ హర్రర్ సీన్స్ లో భయపడుతూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక కథానాయకిగా నటించిన ప్రియాంక జవాల్కర జూనియర్ డాక్టర్ అను పాత్రలో కనిపించింది. సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించిన మాళవిక నాయర్ కి పెద్దగా స్క్రీన్ ప్రెజన్స్ లేకపోయినా .. తన నటనతో సినిమాలో హైలెట్గా నిలిచింది. నటుడు మధు నందన్,అతని అసిస్టెంట్ తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో బాగా నవ్విస్తారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నీకల్ హైలెట్స్ : సాంకేతిక విభాగం గురించి చెప్పాలంటే .. సంగీత దర్శకుడు జెక్స్ బిజాయ్ అందించిన పాటలు బాగున్నాయి. ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంటుంది. సినిమాలోని యస్ కె ఎన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ మంచి స్టోరీ లైన్ తో పాటు కామెడీ సన్నివేశాలతో బాగా ఎంటర్ టైన్ చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నప్పటికి, ఆ లైన్ ను పూర్తిగా కన్విన్స్ చేసిన విధానంలో కథను నడిపాడు. కొన్ని చోట్ల సినిమాటిక్ గా అనిపిస్తాయి. విలన్ తాలూకు సన్నివేశాలను కూడా ఇంకా కొంచెం క్లారిటీ చూపించే ఉంటే బాగుండేది. ముఖ్యంగా రవివర్మ పాత్ర ద్వారా కథను డీల్ చేసిన విధానం బాగుంది. ఈ సినిమా విషయంలో దర్శకుడు లవ్ స్టోరీని మాత్రం ఆ స్థాయిలో మలచలేకపోయారు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ విషయంలో ఇంకొంచెం శ్రద్ద తీసుకుని ఉండీ ఉంటే బాగుండేది.
చివరగా : దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు. చక్కని ట్రీట్మెంట్ తో పాటు మంచి కామెడీ సీన్స్ తో బాగా ఎంటర్ టైన్ చేశారు. అయితే.. దర్శకుడు చాలా చోట్ల ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ లవ్ స్టోరీని మాత్రం ఆ స్థాయిలో మలచలేకపోయారు. మెయిన్ గా హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ విషయంలో ఇంకొంచెం శ్రద్ద తీసుకుని ఉండి ఉంటే బాగుండేది. దీంతో పాటు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువుగా కనిపిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ తన నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ప్రియాంక నటన కూడా చాలా బాగుంది. మరో కీలక పాత్రలో కనిపించిన మాళవిక నాయర్ కి తన నటనతో సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది.