పద్మావత్ - రాజపుత్ర స్త్రీల గౌరవ దర్పణం
బ్యానర్: భన్సాలి ప్రొడక్షన్స్ మరియు వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్
కథ - మాటలు :- సంజయ్ లీలా భన్సాలి, ప్రకాష్ కపాడియా
ఎడిటర్ :- జయంత్ జధర్, అకివ్ అలీ
సంగీతం: సంజయ్ లీలా భన్సాలి , సంచిత్ బల్హరా
ఛాయాగ్రహణం :- సుదీప్ చటర్జీ,
నిర్మాత: సంజయ్ లీలా భన్సాలి, సుధాంశు , అజిత్
కథనం, దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలి విడుదల తేదీ: జనవరి 25, 2018
తారాగణం: దీపికా పదుకోన్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ తదితరులు.
దేశవ్యాప్తంగా కర్ణి సేన, రాజపుత్ ల ఆందోళన లతో వివాదాస్పద చిత్రంగా వార్తల్లో నిలిచిన పద్మావతి సెన్సార్ వారి నిభందనల తో ఎట్టకేలకు పద్మావత్ గా పేరు మార్చుకుని విడుదల కు సిద్ధంగా ఉంది. మీడియా వారికి ప్రత్యేకంగా షో వేసారు. ఈ చిత్రం యొక్క విశేషాలు చూద్దాం.
కథ:- సూఫీ కవి మాలిక్ మహమ్మద్ జాయసీ నవల "పద్మావత్" ఆధారంగా, కాల్పనిక చరిత్ర గా నిర్మించిన చిత్రం "పద్మావత్".
స్త్రీ కాముకుడు, అధికారం కోసం తన వాళ్ళను కూడా చంపగల క్రూరుడు అల్లా ఉద్దిన్ ఖిల్జీ.
పద్మావతి సింహళ దేశపు రాజకుమారి. అతిలోక సౌందర్య రాశి.
మేవాడ్ దేశపు రాజు రతన్ సేన్ సింహళ దేశానికి అతిధిగా వచ్చి రాణి పద్మావతి ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్ళాడి తమ దేశానికి మహారాణి ని చేస్తాడు.
మహారాణి అద్భుతమైన సౌందర్యాన్ని చూసి మోహించిన రాజగురువు రాఘవ్ చేతన్ కు రాణి పద్మావతి ఆదేశంతో రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తాడు రాజు రతన్ సింగ్.
అవమానం తో రాజ్యం విడిచిన రాజ గురువు, రాజ్య కాంక్ష తో యుద్ధం చేస్తున్న అల్లా ఉద్దిన్ ఖిల్జీ చెంతకు చేరి పద్మావతి అతిలోక సౌందర్యం వర్ణిస్తాడు.
మేవాడ్ సంస్థానాన్ని చేజిక్కించుకుని రాణి పద్మావతిని కూడా సొంతం చేసుకోవాలని యుద్ధం ప్రకటించిన అల్లా ఉద్దీన్ ఖిల్జీ గెలిచాడా? రాజపుత్ర రాణుల అభిమాన రాణి పద్మావతీ పంతం నేగ్గిందా అనేది సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:-
* అద్భుతమైన స్క్రీన్ ప్లే
* రాజ వంశీయుల వేషధారణ, చందమామ కథల్లాంటి రాజ ప్రాసాదాలు, భారీ సెట్టింగులు, యుద్ధ సన్నివేశాలు బాహుబలిని మరిపిస్త్తాయి.
* బలమైన ప్రతినాయకునిగా అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ నట విశ్వరూపం - సౌమ్యుడు గా రాజపుత్ర రాజుగా షాహిద్ కపూర్ నటన
* అతిలోక సౌందర్య రాశిగా, చలాకీ తనం తో పాటు తెలివి తేటలున్న భార్యాగా, హుందాగా, మహారాణిగా దీపిక పడుకొన్ నటన.
* సినిమాటోగ్రఫీ , నేపథ్య సంగీతం , అందరి హృదయాలను కదిలించే క్లైమాక్స్.
మైనస్ పాయింట్స్:-
* ఇంటర్వెల్ఫ ట్విస్ట్ మినహా ఫస్ట్ హాఫ్ చాలా స్లో గా ఉంటుంది.
* భన్సాలి గత చిత్రాల స్థాయిలో ఎమోషనల్ డ్రామా, మరియు రొమాన్స్ లేకపోవడం.
* కథ లో వేగం ఉన్నా కథనం లో క్లారిటీ తగ్గి సినిమా సాగుతున్న ఫీలింగ్ వస్తుంది.
* యుద్ద సన్నివేశాలు నిస్తేజంగా అనిపిస్తాయి.
సమీక్ష:- సతీ సహగమనం లాంటి వివాదాస్పద అంశాలు ఉన్నా, రాజ పుత్ర వంశీయుల చారిత్రక విలువలు రాణి పద్మావతి గౌరవానికి భంగం కలగకుండ చాలా తెలివిగా ఎంతో కష్టపడి స్సిప్ట్ రాసుకున్నారు సంజయ్ లీలా భన్సాలి. ఒక చారిత్రిక సత్యాన్ని కాల్పానిక గాథాగా , స్త్ర్రీల హుందాతనాన్ని కాపాడే విదంగా పద్మావతిని తెరకెక్కించిన విధానం బాగుంది. సంకుచిత మనస్తత్వం వదిలి పెట్టి చూస్తె ఒక అద్భుతమైన సినీమా గా చెప్పవచ్చు.