బ్యానర్ :- అన్నపూర్ణ స్టూడియోస్ సంగీతంః శ్రీచరణ్ పాకాల
చాయాగ్రహణం: ఎల్.కె.విజయ్ కూర్పు: శ్రీకర్ ప్రసాద్
కళ: పురుషోత్తం నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్
దర్శకత్వం: శ్రీరంజని విడుదల:- 14 జనవరి 2018
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో రాజ్‌తరుణ్, చిత్రశుక్ల జంటగా నటించిన చిత్రం ‘రంగులరాట్నం’. సెల్వ రాఘవన్ శిష్యురాలు శ్రీ రంజని ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతుంది. మరి ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం.
కథ:- హీరో విష్ణు (రాజ్ తరుణ్) ఓ చిన్న వ్యాపారం నడుపుతూ తన తల్లితో కలిసి ఉంటాడు. శివ(ప్రియదర్శి)..విష్ణుకి మంచి స్నేహితుడు. ఓ రోజు అనుకోకుండా గుడిలో కీర్తి (చిత్ర శుక్ల)ని చూసిన విష్ణు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. అదే సమయంలో విష్ణు తల్లి(సితార), అనుకోకుండా గుండెపోటుతో మరణిస్తుంది. ఆ సమయంలో విష్ణు, కీర్తిని తనతోనే ఉండమని అంటాడు. కీర్తి కూడా విష్ణు ప్రేమను అంగీకరిస్తుంది. అయితే, కీర్తి, విష్ణుపై అమితమైన ప్రేమను చూపిస్తుంది. ఆ ప్రేమ విష్ణుకి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. దాంతో విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? విష్ణు, కీర్తిల ప్రేమ ఫలిస్తుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :-
* హీరో రాజ్ తరుణ్ పర్ఫార్మెన్స్ * తల్లి పాత్రలో సితార అభినయం
* ప్రియదర్శి కామెడి * విజయ్ సినిమాటోగ్రఫీ
* హీరొయిన్ చిత్రా శుక్ల
మైనస్ పాయింట్స్:-
* బలహీనమైన స్క్రీన్ ప్లే * కథలో కొత్తదనం లేదు
* ఆసక్తి కలిగించని సన్నివేశాలు * ఉత్సాహం కలిగించని పాటలు
* యువత మెచ్చే సన్నివేశాలు లేవు
సమీక్ష:- హీరో రాజ్ తరుణ్..ఎప్పటిలాగానే తన పాత్రలో ఎనర్జిటిక్‌గా నటించాడు. అమ్మాయిని ప్రేమను తీసుకోవడం తెలియక ఇబ్బందిపడే పాత్రలో మెప్పించాడు. ఇక చిత్ర శుక్ల గురించి చెప్పాలంటే..మంచి పెర్ఫామెన్స్ చేసే పాత్రలభించింది. ఇక హీరో తల్లి పాత్రలో నటించిన సితార పాత్రలో ఒదిగిపోయింది. ఇక దర్శకురాలు శ్రీరంజనికి కథలో ఏం చెప్పాలనుకుంది అనే దానిపై క్లారిటీ లేదు. స్క్రీన్ ప్లే విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సింది. హీరోతల్లి చనిపోయినప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్..హీరోయిన్ తన తండ్రి గురించి చెప్పే సన్నివేశం ప్రేక్షకులకు నచ్చుతాయి. తనకు ఇచ్చిన అవకాశం దర్శకురాలు సద్వినియోగం చేసుకొని ఉంటె ఒక మంచి సినిమా అయ్యేది..