గ్యాంగ్ తో అలరించిన సూర్య

13 Jan,2018

బ్యానర్‌: స్టూడియో గ్రీన్‌                                               కూర్పు: ఏ. శ్రీకర్‌ ప్రసాద్‌

సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌                                       ఛాయాగ్రహణం: దినేష్‌ కృష్ణన్‌

సమర్పణ: యు.వి. క్రియేషన్స్‌                                      నిర్మాత: కె.ఈ. జ్ఞానవేల్‌రాజా

కథనం, దర్శకత్వం: విఘ్నేష్‌ శివన్‌                                విడుదల తేదీ: జనవరి 12, 2018

నటీనటులు : సూర్య, కీర్తి సురేష్, రమ్య కృష్ణ ఆర్.జే బాలాజీ, శివ శంకర్ మాస్టర్, సుధాకర్ తదితరులు

సూర్య- కీర్తిసురేష్ జంటగా నటించిన సినిమా ‘గ్యాంగ్’. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం యొక్క విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:-  ఉత్తమ్ (సూర్య) ఉద్యోగం కోసం ప్రయత్నించే ఒక మధ్యతరగతి యువకుడు. తనలాగే మరో స్నేహితుడు కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటూ చదువుకు తగ్గ సరైన ఉద్యోగం రాలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఆ సంఘటన తో చలించిపోయిన ఉత్తమ్ వ్యవస్థలో నిజాయితీ లేదని గుర్తిస్తాడు. తన స్నేహితుడికి జరిగిన అన్యాయం మరెవరికీ రాకుడదని నిశ్చయించుకుని తీసుకున్న ఒక అనూహ్యమైన నిర్ణయం ఏమిటి? దాని పర్యవసానంగా జరిగిన కథే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్:-

* పలుకుబడితో , లేదా దొంగ దారిలో ఉద్యోగం ఇస్తున్న వ్యవస్థ పై పోరాటం.

* సి.బి.ఐ. ఆఫీసర్ గా సూర్య నటన

* రమ్యకృష్ణ సపోర్టింగ్ రోల్ లో అద్భుతమైన నటన

* ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చిన ట్విస్ట్

* సామాన్యుల కష్టాలను తెరకెక్కించిన విధానం.

మైనస్ పాయింట్స్:-

* సినిమా అంతా కూడా సరదాగా సాగిపోతూ ఎక్కడా సీరియస్ నెస్ లేకపోవటం.

* తెలుగు నేటివిటి లోపించి నిదానంగా సాగుతున్నట్టుగా ఉండటం.

* బ్యాక్ గ్రౌండ్ స్కోరు మరియు పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు.

* ఉత్ఖంట కలిగించే సన్నివేశాలు లేకపోవటం

* క్లైమాక్స్ లో బలహీనమైన సన్నివేశాలు 

దినేష్ కృష్ణన్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన సన్నివేశాలు బాగా వచ్చాయి. స్టూడియో గ్రీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సామాన్యులు ఎలా ఉంటారు ? వారి భాదలు ఏంటి ? వంటి అంశాలు బాగా చూపించారు.

తీర్పు:-

మెరిట్ ఉన్నవాడికి జాబ్ ఇవ్వకుండా డబ్బు ఉన్నోడికి ఉద్యోగం లభిస్తోన్న ఈ వ్యవస్థలో మార్పు రావాలన్న మంచి ఉద్దేశం తో  తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. మంచి కాన్సెప్ట్, ఎంటర్టైన్మెంట్, సూర్య పెర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ మెప్పించే అంశాలు కాగా నెమ్మదిగా సాగే సెకండాఫ్ కథనం, తీవ్రత లోపించిన కీలక సన్నివేశాలు, లాజిక్స్ కు అందని కొన్ని రాబరీ సీన్స్ నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద సంక్రాంతి బరిలో నిలిచిన ‘గ్యాంగ్’ మంచి మెసేజ్ ఇచ్చి సంతృప్తిని కలిగిస్తుండడంలో సందేహం లేదు.

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY