బ్యానర్: సికె ఎంటర్‌టైన్‌మెంట్స్ కథ, మాటలు: ఎం. రత్నం
కూర్పు: ప్రవీణ్ ఆంటోని సంగీతం: చిరంతన్ భట్
ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్ నిర్మాత: సి. కళ్యాణ్
కథనం, దర్శకత్వం: కె.ఎస్. రవికుమార్ విడుదల తేదీ: జనవరి 12, 2018
తారాగణం: నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ, బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్, అశుతోష్ రాణా, ప్రభాకర్, ప్రియ, మురళిమోహన్, జయప్రకాష్‌రెడ్డి తదితరులు
నట సింహం నందమూరి బాలక్రిష్ణ నటించిన 102వ చిత్రం ‘జై సింహ’ భారీ అంచనాల నడుమ ఈరోజే విడుదలైంది. కె.ఎస్. రవికుమర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ:- నరసింహ (బాలక్రిష్ణ) అప్పుడే పుట్టిన తన కొడుకుతో వైజాగ్ వదిలేసి అనేక ప్రాంతాలు, రాష్ట్రాలు తిరుగుతూ చివరికి కుంభకోణంకు చేరుకుంటాడు. అలా అక్కడే డ్రైవర్ గా పని చేసుకుంటున్న అతనికి ఒక ఇన్సిడెంట్ ద్వారా గతంలో తాను ప్రేమించిన అమ్మాయి గౌరి (నయనతార) ఎదురవుతుంది. కానీ అప్పటికే ఆమె అతనిపై ద్వేషం పెంచుకుని, అసహ్యించుకునే స్థాయిలో ఉంటుంది. అసలు నరసింహ కొడుకుతో సహా వైజాగ్ వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు ? ప్రాణంగా ప్రేమించిన గౌరి అతన్ని ఎందుకు శత్రువులా చూస్తుంది ? అతని గతమేమిటి ? అనేదే సినిమా
సంక్రాంతి, సింహా... ఈ రెండూ అంటే బాలయ్య కి సెంటిమెంటు. తన సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి టైటిల్‌లో సింహం ఉంటె,ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న అభిప్రాయం ప్రేక్షకులకు కూడా ఉంది. 'జై సింహా' బాలకృష్ణ ట్రెండ్‌కి తగ్గ సినిమా ను అందించిన కే.ఎస్. రవికుమార్ తనదైన శైలిలో బాలకృష్ణని ఒక మాస్, ఫ్యామిలీ డ్రామాలో అభిమానులను అలరించేందుకు ప్రయత్నం చేసాడు.
ప్లస్ పాయింట్స్ :
* బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ - బాలకృష్ణ డైలాగ్స్ - బాలకృష్ణ డాన్సులు
* కుంభకోణం బ్రాహ్మణుల గొప్పతనం ఎపిసోడ్
* ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్.
* ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్యలో ఉన్న ఎనర్జీ
* క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్ :-
* బాలకృష్ణ గత చిత్రాల లాగే ఇంతకుముందు చూసిన సినిమా లాగే అనిపిస్తుంది.
* నయనతార పాత్రకు కావలసిన బలమయిన సన్నివేశాలు లేకపోవటం.
* బ్రంహానందం కామెడి అనుకున్న స్థాయిలో లేదు.
* హీరో పాత్ర కు తగ్గ స్థాయికి విలన్ క్యారెక్టర్ లేకపోవటం
* హీరొయిన్ పాత్రలకు కథలో పెద్దగా స్థానం లేకపోవటం.
సమీక్ష :- బాలకృష్ణ ఈ ఏజ్‌లోను వేసిన గ్రేస్‌ఫుల్ డాన్సులు, ఫైట్స్‌లో చూపించిన ఎనర్జీ అభిమానులని అలరిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లోని మెకానిక్ క్యారెక్టర్ స్టయిలిష్‌గా వుంది. బాలయ్య అభిమానులతో పాటు , మహిళా ప్రేక్షకులకు కూడా నచ్చేలా ఉంది. ఈ చిత్రం ఈ పండగ సీజన్‌లో స్ట్రాంగ్ అపోజిషన్ లేకపోవడం కూడా ఈ చిత్రానికి కలిసివచ్చే మరో ఎలిమెంట్. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అభిమానులను దృష్టిలో పెట్టుకొని చేసిన చిత్రం.