రజినీకి జోడిగా నయనతార కీర్తి సురేష్

04 Mar,2019

‘పేట’ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ తన తరువాతి చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ తో చేయనున్నారు. ఈ చిత్రంలో రజినీ కి జోడిగా ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఎంపిక చేశారు. అందులో ఒకరు లేడీ సూపర్ స్టార్ నయనతార కాగా మరొకరు మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. ఇక నయన్ ఇంతకుముందు రజినీ సరసన ‘చంద్రముఖి , కథానాయకుడు’ చిత్రంలో నటించగా కీర్తి కి మాత్రం రజినీ తో ఇదే మొదటి సినిమా. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో తలైవా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మార్చి మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించనున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Recent News