సుహాస్‌, కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మల‌ న్యూ ఏజ్ కామెడీ డ్రామా `శ్రీ‌రంగ‌నీతులు` టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

16 May,2023

సుహాస్, కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం `శ్రీ‌రంగ‌నీతులు`. రాధావి ఎంట‌ర్టైన్‌మెంట్స్‌ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రం ద్వారా ప్ర‌వీణ్ కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఈ రోజు టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

 

ఈ టైటిల్ పోస్ట‌ర్‌ని ప‌రిశీలిస్తే...మైధానంలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ముందు ముగ్గురు యువ‌కులు కూర్చుని ఉండ‌డం గ‌మ‌నించ‌వచ్చు. టైటిల్ క్యాచీగా ఉండ‌డంతో పాటు టైటిల్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటోంది. అతి త్వ‌ర‌లో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు చిత్ర యూనిట్‌.

 

`అర్జున్ రెడ్డి ` ఫేమ్ హ‌ర్ష వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, `సేవ్ ది టైగ‌ర్స్` ఫేమ్ అజ‌య్ అర్సాడ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి టిజో టామి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విరాజ్ అశ్విన్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, గీత భాస్క‌ర్‌, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నునున్నారు.

 

న‌టీన‌టులు: సుహాస్‌, కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, గీత భాస్క‌ర్‌, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, దేవీ ప్ర‌సాద్, జీవ‌న్ రెడ్డి, సంజ‌య్ స్వ‌రూప్‌,సీవిఎల్ న‌ర‌సింహా రావు త‌దిత‌రులు..

 

సాంకేతిక వర్గం:

క‌థ‌,మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌వీణ్ కుమార్ వీఎస్ఎస్,

నిర్మాణ సంస్థ‌: రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌,

నిర్మాత‌: వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి,

సంగీతం: హ‌ర్ష వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, అజ‌య్ అర్సాడ‌,

సినిమాటోగ్ర‌ఫి: టిజో టామి,

పీఆర్ఓ: దుద్ధి శ్రీ‌ను - సిద్ధు.

Recent News