ప్రముఖ మంచు మోహన్ బాబు మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నారా? అంటే అవుననే సమాచారం. 2.ఓ వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఇప్పటికే మణి రత్నం మోహన్ బాబును సంప్రదించారు. సూచన ప్రాయంగా ఓకే అన్నారని తెలుస్తోంది. మోహన్ బాబు ఈ మధ్య పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. అడపా దడపా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో అవకాశం వస్తే నటిస్తున్నారు. ప్రస్తుతం మణిరత్నం లాంటి సీనియర్ దర్శకుడి నిర్ధేశనంలో అవకాశం అందుకున్నారంటే ఆ పాత్రకు ఉండే ప్రాధాన్యత ఎంతో ఊహించవచ్చు. ఇటీవలే `చెక్క చివంత వానం` (నవాబ్) చిత్రంలో అద్భుతమైన క్యారెక్టరైజేషన్స్ ని చూపించిన మణిరత్నం మరోసారి అదే తీరుగా అద్భుతమైన పాత్రల చిత్రణతో భారీ మల్టీస్టారర్ కి ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్ - విజయ్ సేతుపతి- జయం రవి వంటి స్టార్లను ఫైనల్ చేసుకుని ఇతరత్రా పాత్రల కోసం వెతుకుతున్నారు .