ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ తనయుడు శంతన్ భాగ్యరాజ్, సృష్టి డాంగే జంటగా తమిళంలో రూపొందిన చిత్రం `ముప్పరి మనమ్`. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం రైట్స్ ఫ్యాన్సీ రేటుతో దక్కించుకున్న భువన్ కుమార్ అల్లం, ధను క్రియేషన్స్ బేనర్ పై `లవ్ గేమ్` పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఆది రూపన్ దర్శకుడు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 8న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ హైదరాబాద్‌లో జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వి చ్చేసిన ``అనిల్‌రావిపూడి మాట్లాడుతూ... ``భాగ్యరాజ్‌గారు నా `ఎఫ్2` చిత్రం చూసి ప్రతీ డైలాగ్ గుర్తుంచుకొని నాకు ఫోన్ చేసి మరీ ప్రశంసించారు. కుటుంబ కథా చిత్రాలు చేయడంలో భాగ్యరాజ్గారి తర్వాతే ఎవరైనా. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో నేను ఈ ఫంక్షన్ కు హాజరుకావడం అదృష్టంగా భావిస్తున్నా`` అన్నారు.
డైరక్టర్ కరుణాకరన్ మాట్లాడుతూ... `` నేను భాగ్యరాజ్ గారికి పెద్ద ఫ్యాన్ ని . వారి తనయుడు తమిళంలో నటించిన ఈ సినిమా తెలుగులో `లవ్ గేమ్ ` పేరుతో వస్తోంది. ఇక్కడ బాగా ఆడాలని కోరుకుంటున్నా`` అన్నారు. డైరక్టర్ చంద్రమహేష్ మాట్లాడుతూ... ``ముందుగా ఈ `లవ్‌గేమ్` ప్రొడ్యూసర్‌కి నా శుభాకాంక్గలు. నేను భాగ్యరాజ్గారికి ఏకలవ్యశిష్యుణ్ని. సెంథిల్ చాలా అద్భుతమైన ఆర్టిస్ట్. ఈ చిత్రం తప్పకుండా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను`` అన్నారు. హీరో శంతన్ భాగ్యరాజ్ మాట్లాడుతూ...`` 30ఏళ్ళ నుంచి మా నాన్నగారిని ఆదరిస్తున్నారు. అదే ఆదరణ నాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నాను. ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ ఉంటుంది. అది అందరికీ అనెక్ట్ అవుతుంది`` అన్నారు.
ప్రొడ్యూసర్ భువన్ కుమార్ అల్లం మాట్లాడుతూ... `` నేను 20 సినిమాలు చూశాను. అందులో ఈ సినిమా బాగా నచ్చింది. వెంటనే రైటర్ వెన్నెలకంటిగారిని చూడమన్నా... ఆయన ఈ సినిమాని ఎంతో మెచ్చుకున్నారు. మీరు ఈ సినిమాకి నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు నేను వర్క్ చేస్తాను అన్నారు. దాంతో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ సినిమా తప్పకుండా తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా`` అన్నారు.
నటుడు భాగ్యరాజ్ మాట్లాడుతూ...``మా అబ్బాయి నటించిన తమిళ చిత్రం తెలుగులో `లవ్ గేమ్` పేరుతో తెలుగులో కి విడుదలవుతోంది. డెఫ్‌నెట్‌గా ఇక్కడ కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నా. నా డబ్బింగ్ చిత్రాలన్నీ ఇక్కడ సూపర్హిట్లు అయ్యాయి. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారని నమ్ముతున్నా`` అన్నారు.
నటి రమ్యకృష్ణ మాట్లాడుతూ... ``భాగ్యరాజ్ గారు ఇండియాలోనే జీనియస్ డైరెక్టర్. ఆది రూపన్ ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్లో చాలా టాలెంటెడ్ డైరక్టర్ . ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
డైరక్టర్ తేజ మాట్లాడుతూ... ``నేను భాగ్యరాజ్గారికి పెద్ద ఫ్యాన్‌ని. నేను చదువుకునే రోజుల్లో ఆయన సినిమాలన్నీ చూసేవాడ్ని. వాళ్ళ అబ్బాయి సినిమా ఇక్కడ రిలీజ్ అయి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
హీరో రాజశేఖర్ మాట్లాడుతూ... ``భాగ్యరాజ్‌గారు చాలా మంచి స్క్రీన్ ప్లే డైరెక్టర్. వాళ్ళ అబ్బాయి అంటే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు . వారి స్థాయిలో కచ్చితంగా గొప్ప పేరు తెచ్చుకుంటాడు. తప్పకుండా` లవ్‌గేమ్` తెలుగులో పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.