ఒంగోలు షెడ్యూల్ పూర్తీ చేసుకున్న హీరో కార్తికేయ

02 Mar,2019

‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఒంగోలులో జ‌రిగింది. ఈ భారీ షెడ్యూల్‌తో 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. హీరో కార్తికేయ మాట్లాడుతూ ``కొన్ని క‌థ‌లు విన‌గానే న‌చ్చుతాయి. మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తుకొస్తుంటాయి. న‌లుగురితో పంచుకోవాల‌నిపిస్తుంటాయి. నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన క‌థ అలాంటిదే. విన‌గానే న‌చ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. ఇటీవ‌ల ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. ప్ర‌తి ఫ్రేమూ రియ‌లిస్టిక్‌గా వ‌చ్చింది`` అని అన్నారు.  దర్శకుడు అర్జున్‌ జంధ్యాల మాట్లాడుతూ ``రియ‌లిస్టిక్ చిత్ర‌మిది. వాస్త‌వ ఘ‌ట‌న‌లనుంచి స్ఫూర్తి పొంది రాస‌కున్న క‌థ‌. ఎంతోమంది మ‌న‌సుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. హీరో పాత్ర యువ‌త‌కు రెప్ర‌జంటేష‌న్‌లాగా ఉంటుంది. అన్నీర‌కాల భావోద్వేగాలుంటాయి. అన్నీ అంశాలూ మిళిత‌మైన స‌బ్జెక్ట్ గా రూపొందించాం. అంద‌రూ చూడ‌ద‌గ్గ చిత్ర‌మ‌వుతుంది. రియ‌లిస్టిక్ యాక్ష‌న్ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది`` అని తెలిపారు.
నిర్మాతలు  మాట్లాడుతూ ``తొలి షెడ్యూల్ ఒంగోలులో చేశాం. దాదాపు 25 రోజులు అక్క‌డి క్వారీలు, గ్రానైట్ ఫ్యాక్ట‌రీలు, కాల‌నీలు, రిజ‌ర్వాయ‌ర్ల‌లో షూటింగ్ చేశాం. కీల‌క‌మైన టాకీ పోర్ష‌న్‌, ఒక పాట‌, కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్స్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. దీంతో దాదాపుగా 40 శాతం షూటింగ్ ముగిసింది. మార్చి 5 నుంచి యూర‌ప్‌లోని క్రొయోషియాలో రెండు పాట‌ల‌ను తెర‌కెక్కిస్తాం`` అని అన్నారు. 

Recent News