గురునాథ రెడ్డి సమర్పణలో ఎ.బి.టి క్రియేషన్స్ బ్యానర్‌పై రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వంలో ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం `వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ`. రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మార్చి 15న సినిమా భారీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా... చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ - ``రాయ్‌లక్ష్మీగారు ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న మా వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మీ చిత్రాన్ని మార్చి 15న విడుదల చేస్తున్నాం. రాయ్ లక్ష్మీగారు నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అలాగే ప్రవీణ్, మధునందన్ పాత్రలు చాలా ఎంటర్ టైనింగ్‌గా సాగుతాయి. అలాగే రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ పాత్రలు సినిమాకు కీలకంగా ఉంటాయి. కామెడీ, హారర్, గ్లామర్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ మూవీ ఇది. హరి గౌరగారు అందించిన పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఏమాయ చేసిందో ఏమంత్రం వేసిందో... అత్తిలిపాప .. పాటలకు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్ సూపర్బ్‌గా ఉందని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమాపై మంచి అంచనాలున్నాయి`` అన్నారు.
నటీనటులు : రాయ్ లక్ష్మీ, ప్రవీణ్, మధు నందన్, రామ్ కార్తిక్, పూజిత పొన్నాడ, బ్రహ్మాజీ, పంకజ్ కేసరి, అన్నపూర్ణమ్మ, జబర్దస్త్ మహేష్, జెమినీ సురేష్ తదితరులు..
సాంకేతిక నిపుణులు :
దర్శకత్వం : కిషోర్ కుమార్
నిర్మాతలు: ఎం.శ్రీధర్ రెడ్డి , హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి
బ్యానర్ : ఏబీటి క్రియేషన్స్
సమర్పణ : గురునాథ్ రెడ్డి
సినిమాటోగ్రఫీ : వెంకట్ ఆర్.శాఖమూరి
మ్యూజిక్ : హరి గౌర
కథ, కథనం, మాటలు : తాటవర్తి కిరణ్
ఎడిటర్ : ఎస్.ఆర్. శేఖర్
ఆర్ట్ : బ్రహ్మ కడలి
ఫైట్స్ : రామ్ సుంకర
డాన్స్ మాస్టర్ : శేఖర్
PRO : వంశీ-శేఖర్