అఖిల్ సరసన ప్రియాంక జవల్కర్

28 Feb,2019

ప్రియాంక జవాల్కర్ తెలుగులో 'ట్యాక్సీవాలా' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. సినిమా మొత్తం లీక్ అయిన కారణంగా అసలు ప్రియాంక జవాల్కర్ కు మరో అవకాశం వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే అనూహ్యంగా ప్రియాంక జవాల్కర్ 'ట్యాక్సీవాలా' చిత్రం మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది. ఆలస్యం అయినా లీక్ అయినా వాటిని పట్టించుకోకుండా సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ట్యాక్సీవాలా' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హీరోయిన్ కు రవితేజ మూవీలో నటించే అవకాశం దక్కింది. డిస్కోరాజా చిత్రంలో హీరోయిన్ గా ఈ అమ్మడు ఎంపిక అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా ఆ విషయమై అధికారిక క్లారిటీ రాలేదు. తాజాగా అక్కినేని అఖిల్ కు జోడీగా ప్రియాంక జవాల్కర్ ఎంపిక అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అఖిల్ ప్రతిష్టాత్మక నాల్గవ సినిమా గీతాఆర్ట్స్ లో రూపొందబోతుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటించబోతున్న మూవీ కోసం గీతా ఆర్ట్స్ వారు ప్రియాంక జవాల్కర్ ను సంప్రదించినట్లుగా సమాచారం అందుతోంది. అఖిల్ కు జోడీగా నటించే అవకాశం రావడంతో ఈ అమ్మడికి లక్ కలిసి వచ్చింది.
 

Recent News