మహర్షి షూటింగ్ కు  అడ్డంకి

26 Feb,2019

సూపర్ స్టార్ మహేశ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మహర్షి'. సినిమాలో మహేశ్ కాలేజ్ స్టూడెంట్ గాను .. బడా సంస్థకి సీఈఓ గాను .. రైతుగాను మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. తాజాగా హైదరాబాద్ - శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరగనున్న ఈ సినిమా షూటింగుకి అనుకోని అవాంతరం ఎదురైంది. ఎయిర్ పోర్ట్ నుంచి మహేశ్ బాబు వెళ్లిపోయేలా చేసింది.నిన్న ఉదయం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షూటింగ్ చేసుకోవడానికి 'మహర్షి' టీమ్ అధికారుల నుంచి ముందుగానే అనుమతులు తీసుకుంది. అయితే భద్రతా సంబంధమైన కొన్ని సమస్యల కారణంగా, అధికారులు తాము ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. హై అలర్ట్ ప్రకటించిన కారణంగా, అధికారులతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేకుండాపోయింది. దాంతో 5 గంటలపాటు తన క్యారవాన్ లో నిరీక్షించిన మహేశ్ బాబు, ఓపిక నశించడంతో తిరిగి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Recent News