ట్రైలర్ తో భయపెడుతోన్న జెస్సీ

26 Feb,2019

ఈ మధ్యకాలంలో తెలుగు తెరపై హర్రర్ సినిమాలు పలకరిస్తూనే ఉన్నాయి. తక్కువ బడ్జెట్ తో ఈ జోనర్ లో కథలు రూపొందిస్తు మంచి విజయాలు అందుకుంటున్నారు.  ఒక వర్గం ప్రేక్షకుల ఆదరణ వీటికి ఉంటుంది గనుక ఈ సినిమాల నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అలా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ రెడీ అవుతోంది .. ఆ సినిమా పేరే .. 'జెస్సీ'. అర్చన .. అశ్విని కుమార్ .. అతుల్ కులకర్ణి .. కబీర్ దుహాన్ సింగ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసం వచ్చిన ఘోస్ట్ హంటర్స్ కి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే కథాంశంతో ఈ సినిమా రూపొందినట్టుగా ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. 'నీకు కనిపించే శరీరం ఒక అబద్ధం .. మీ అక్కకి దెయ్యం పట్టింది' అనే డైలాగ్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సస్పెన్స్ .. హారర్ నేపథ్యంలో లో సాగిన సీన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent News