వినాయక్ దర్శకత్వంలో మాస్ రాజా

26 Feb,2019

మాస్ రాజా రవితేజ నెక్స్ట్ సినిమాకు ఓకే చెప్పేసాడు. ఇటీవలే అయన నటించిన సినిమాలు నిరాశ పరచడంతో ఈ సారి పక్కా మాస్ మసాలా సినిమాతో ముందుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అయన ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. వినాయక్ చెప్పిన కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు. వినాయక్ - రవితేజ కాంబినేషన్ లో వచ్చిన కృష్ణా సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. 

Recent News