రోజాపూలు, ఒకరికిఒకరు, పోలీస్ పోలీస్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. వంటి విజయవంతమైన చిత్రాలతో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్ కొంత విరామం తరువాత తెలుగులో నటిస్తున్న చిత్రం అసలేం జరిగింది. ఈ చిత్రంలో శ్రీరామ్ సరసన కన్నడ భామ సంచితా పదుకునే నాయికగా నటిస్తోంది. ఎక్సోడస్ మీడియా పతాకంపై శ్రీమతి నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్ ఎన్‌వీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారు. నెర్రపల్లి వాసు అద్భుతమైన కథను సమకూర్చారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను సహ నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ తెలియజేస్తూగ్రామీణ నేపథ్యంలో కొనసాగే ఒక సస్పెన్స్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. హీరో శ్రీరామ్, సంచితాపదుకునే జంట చక్కగా కుదిరింది. అందం, అభినయం కలగలిసిన అచ్చ తెలుగుఅమ్మాయిలా సంచితా పదుకునే ఈ చిత్రంలో కనిపిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాం. మే చివరిలోపు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.