తమిళ శివ‌పుత్రుడు హిందిలోకి

22 Feb,2019

విక్రమ్‌కు నటుడిగా ఎంతో పేరుతో పాటు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టిన  చిత్రం శివపుత్రుడు. ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయ‌నున్నారు.  హిందీ లో  విక్ర‌మ్ పాత్ర‌ను ఎవరు చేయబోతున్నారన్న అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. దర్శకుడిగా బాలా ఇమేజ్‌ను కూడా శివపుత్రుడు తారా స్థాయికి తీసుకెళ్లింది. హిందీ రీమేక్‌కు సతీష్ కౌషిక్‌ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. గతంలో బాలా దర్శకత్వంలో తెరకెక్కిన సేతు సినిమాను తేరే నామ్‌ పేరుతో రీమేక్‌ చేసిన సతీష్‌ ఇప్పుడు శివపుత్రుడును కూడా తెరకెక్కించడం విశేషం. మరి హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది. 

Recent News