డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రైడ్, వీర చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఎ హవీష్ లక్ష్మణ్ కొనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మాతగా కొత్త చిత్రం గురువారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హవీష్ క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా .. నిర్మాత హవీష్ కొనేరు మాట్లాడుతూ - ``తమిళంలో సూపర్‌డూపర్‌హిట్ అయిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో మా బ్యానర్‌లో చేయడం చాలా ఆనందంగా ఉంది. మా బ్యానర్‌లో ప్రెస్టీజియస్‌గా ఈ సినిమాను లావిష్‌గా తెరకెక్కించబోతున్నాం. బెల్లంకొండ శ్రీనివాస్‌గారు ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన తన లుక్‌ని మార్చుకున్నారు. ఈ సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను రమేష్‌వర్మగారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈరోజు నుండే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను తెలియజేస్తాం`` అన్నారు.