గీత గోవిందం దర్శకుడితో అఖిల్

19 Feb,2019

భారీ హిట్ కోసం అక్కినేని అఖిల్ ఎన్ని కసరత్తులు చేసినా.. ఆశించిన స్థాయిలో హిట్ మాత్రం రావట్లేదు. మంచి అంచనాల మధ్య విడుదలైన ‘మిస్టర్ మజ్ను’ ఆ అంచనాలను తలక్రిందుల చేస్తూ.. మిక్సడ్ రివ్యూస్ కే పరిమితమైంది. దాంతో అఖిల్ తన తరువాత సినిమా పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాగా దర్శకుడు పరశు రామ్ ‘గీత గోవిందం’తో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పరశురామ్ తన తర్వాత సినిమాని అఖిల్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు కథ చెప్పాడట. ఒకవేళ అఖిల్ – పరుశు రామ్ కాంబినేషన్ గాని, సెట్ అయితే ఆ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మించనుంది. అలాగే అఖిల్ కు పరశురామ్ తో పాటు, భాస్కర్ కూడా కథ వినిపించారట. అయితే అఖిల్, పరశురామ్ వైపే ఎక్కువుగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి తరువాత చేయబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం. 

Recent News