గ్లామర్ తో షాకిస్తున్న ఆర్ ఎక్స్ హీరోయిన్

19 Feb,2019

'RX100' సినిమాతో  తెలుగు తెరకు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్  మొదటి సినిమాలోనే నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర పోషించడమే కాకుండా బోల్డ్ యాక్టింగ్ తో.. ఘాటు లిప్ లాకులతో చెలరేగిపోయి అందరి దృష్టిని ఆకర్షించింది.  అయినా అది చాలదన్నట్టు సోషల్ మీడియాలో ఘాటు ఫోటో షూట్లతో నెటిజనులపై విరుచుకుపడుతోంది. ఈ భామ మిస్సా మోర్ క్లోతింగ్ కు బ్రాండ్ అంబాజిడర్.  దీంతో సదరు బ్రాండ్ దుస్తులు ధరించి ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను ఎడాపెడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా లో అప్లోడ్ చేసిపారేసింది. నెటిజనులు మాత్రం ఫోటోలపై ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. పాయల్ తాజాగా  'వెంకీమామ' లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా.. 'మన్మధుడు-2' నాగార్జునకు జోడీగా నటించే అవకాశాలు వచ్చాయని టాక్ వినిపిస్తోంది. ఈ ఆఫర్లపై ఇంకా అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ఈ సినిమాలు కాకుండా తమిళంలో 'ఏంజెల్' అనే సినిమా చేస్తోంది. 

Recent News