విజయ్ దేవరకొండ నిర్మాతగా మీకు మాత్రమే చెప్తా

19 Feb,2019

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ త్వరలో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నాడు. కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో విజయ్ దేవరకొండ  నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమాలో తనను హీరోగా పరిచయం చేసిన తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తాడట.  షమ్మీర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రానికి రూపకల్పన చేశారని సమాచారం. పెళ్లిచూపులు చిత్రం ద్వారా దర్శకుడు తరుణ్‌భాస్కర్, హీరో విజయ్‌దేవరకొండ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. వ్యక్తిగతంగా కూడా వీరిద్దరి మధ్య చక్కటి సాన్నిహిత్యం ఉంది. దీంతో ఈ సినిమా విషయంలో విజయ్‌దేవరకొండ ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారట. ఇందులో తరుణ్‌భాస్కర్ లుక్స్ కూడా వైవిధ్యంగా ఉంటాయని చెబుతున్నారు.   దర్శకత్వంతో పాటు నటుడిగా కూడా రాణిస్తున్నాడు తరుణ్‌భాస్కర్.  ఫలక్‌నుమా దాస్ చిత్రంలో ఫుల్‌లెంగ్త్ రోల్‌ను పోషించారు. 

Recent News