జాతీయ నటుడు కమల్ హాసన్ – క్రేజీ దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కతున్న భారతీయుడు 2 మొదటి షెడ్యూల్ బుధవారం నుండి చెన్నైలో మొదలైంది. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను మాత్రమే తెరకెక్కించనున్నారు. అయితే నిజానికి ఎప్పుడో మొదలు కావల్సిన షూటింగ్ మేకప్ విషయంలో కమల్ అసంతృప్తిగా ఉండడంతో ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. తాజాగా కమల్ వీటిని కొట్టిపారేశారు. ఈచిత్రం యొక్క మేజర్ షూటింగ్ అంత విదేశాల్లోనే జరుగనుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2020లో సంక్రాంతికి కానుకగా విడుదలకానుంది.